లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలపై ఏసీబీ దాడులు

Published

on

ACB attacks on MD and GM of Telangana State Warehousing Company : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలు.. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు.. ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని కార్యాలయంలో.. జీఎం సుధాకర్ రెడ్డి 75 వేలు లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరా చారి, జీఎం సుధాకర్ రెడ్డి.. లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో ఏ1గా భాస్కరా చారి, ఏ2గా సుధాకర్ రెడ్డిపై.. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. భాస్కరాచారి గిడ్డంగుల సంస్థతో పాటు మార్క్ ఫెడ్, హాకా ఎండీగానూ వ్యవహరిస్తున్నారు. ఇద్దరి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.