లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అక్రమార్కులపై కొరడా : ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలపై ఏసీబీ ఫోకస్‌

Published

on

Illegals in Indrakeeladri : ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలపై ఏసీబీ ఫోకస్‌ చేసింది. అమ్మవారి సొమ్మును అడ్డంగా దోచుకున్న అధికారుల లిస్ట్‌ రెడీ చేసింది. మూడ్రోజుల సోదాల్లో నాలుగేళ్ల ఫైల్స్‌ను తవ్వి తీసిన ఏసీబీ టీమ్స్‌… గత పాలకమండలి హయాంలో వచ్చిన ఆరోపణలపైనా రిపోర్ట్‌ రెడీ చేసింది. దుర్గ గుడిలో అక్రమాల్ని ఏసీబీ అధికారులు తవ్వితీశారు. మూడ్రోజులపాటు అన్ని విభాగాల్లో సోదాలు నిర్వహించి… అధికారుల అవినీతిపై కీలక సమాచారం రాబట్టారు.

ప్రస్తుత పాలకమండలి హయాంలో జరుగుతున్న పనులపైనే కాకుండా.. గత నాలుగేళ్ల ఫైళ్లను పరిశీలించారు. గత పాలకమండలి హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో… అప్పట్లో జరిగిన అన్ని పనులకు సంబంధించిన ఫైళ్లను తవ్వి తీశారు. కొండపై అభివృద్ధి పనులు, ఇంజినీరింగ్‌, టెండర్ల పనుల డేటా సేకరించారు.

ఇంద్రకీలాద్రిపై అసలేం జరుగుతోంది? గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏసీబీ సోదాలు మూడ్రోజులపాటు ఎందుకు సాగాయి? బెజవాడలో ఇప్పుడివే ప్రశ్నలు అందర్నీ తొలిచివేస్తున్నాయి. గతంలోనూ విజిలెన్స్‌, ఏసీబీ సోదాలు నిర్వహించినా.. ఇంత సుదీర్ఘంగా ఎన్నడూ జరగలేదని చెబుతున్నాయి దుర్గగుడి వర్గాలు. పక్కా సమాచారంతోనే రంగంలోకి ఏసీబీ అధికారులు దిగారని తెలుస్తోంది. రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్‌ను కేవలం 40 లక్షలకే విక్రయించినట్లు గుర్తించారు.

శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చాయి తేల్చారు. లడ్డూ ప్రసాదాలు, టిక్కెట్, చీరల కౌంటర్లతో పాటు టోల్ గేట్, కేశ ఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగాల్లో… ఏ ఫైల్‌ తీసినా అవినీతిమయమైనట్లు ఏసీబీ టీమ్స్‌ నిర్ధారించాయి. ఈ స్థాయిలో అక్రమాలు సాగుతున్నా ఈవో సురేశ్‌బాబు ఎందుకు పట్టించుకోవడాన్ని ఏసీబీ అనుమానిస్తోంది.

దేవస్థానంలో ఏ పనిచేసినా.. వాటికి సంబంధించిన ఫైళ్లను ఈవో పరిశీలించాకే అప్రూవ్‌ చేయాలి. కానీ.. ఇంద్రకీలాద్రిపై ఇలాంటి రూల్స్‌ పాటించట్లేదని ఏసీబీ తేల్చింది. ఇప్పటిదాకా బయటపడ్డ అవినీతిపై ప్రశ్నిస్తే… ఈవో సురేశ్‌బాబు సమాధానాలివ్వకుండా… దాటేస్తున్నట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఇదే తంతు సాగడంతో ఏసీబీ అధికారులు అసహనానికి గురైనట్లు సమాచారం. ఇక- మూడ్రోజులుగా అవినీతి ఫైళ్లను తవ్వి తీసిన అధికారులు… ప్రతి విభాగంలోనూ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. వీటిపై త్వరలోనే ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ పంపించేందుకు రెడీ అవుతున్నారు.