Home » ESI స్కామ్ : ఓ చానల్ రిపోర్టర్ ఇంటితో పాటు 23 చోట్ల ఏసీబీ సోదాలు
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు ఇళ్లలో గురువారం(సెప్టెంబర్ 26, 2019) సోదాలు
Published
1 year agoon
By
veegamteamఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు ఇళ్లలో గురువారం(సెప్టెంబర్ 26, 2019) సోదాలు
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు ఇళ్లలో గురువారం(సెప్టెంబర్ 26, 2019) సోదాలు నిర్వహిస్తోంది. 12 మంది అధికారులు, 10 మంది అనధికారులు.. ఓ చానల్ రిపోర్టర్… మొత్తం 23మంది ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తోంది. మందుల కొనుగోళ్లలో రూ.10కోట్ల అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి, వరంగల్ జాయింట్ డైరెక్టర్ పద్మ, స్టోర్స్ ఏడీ వసంత, ఓమ్నీ మెడికల్ సిబ్బంది, తేజా ఫార్మా ఉద్యోగి భాస్కర్‌రెడ్డి, ఓ ఛానల్ రిపోర్టర్ నరేందర్ నివాసంతోపాటు 23 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 12 గంటల పాటు సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్నారు. ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు టెన్ టీవీ గతంలోనే వెలుగులోకి తెచ్చింది. అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేసింది.
డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఛాంబర్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రుల డిస్పెన్సరీలలో మందులు, వైద్య పరికరాలు కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి. అవసరం లేకపోయినా రూ.300 విలువైన మందులు కొనుగులో చేశారని అధికారులు గుర్తించారు. బినామీ పేర్లతో మందులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. అర్హత లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేశారు. డైరెక్టర్ దేవికారాణి అధిక ధరలకు మందులు కొనుగులో చేసినట్టు విచారణలో వెల్లడైంది. భారీ స్కామ్ పై రంగంలోకి దిగిన ఏసీబీ విచారణను ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్..61 మందిపై కేసులు..41 బైకులు, 19 కార్లు, ఆటో సీజ్
రూ.60కే తిన్నంత బిర్యానీ..బాస్మతి రైస్, మినరల్ వాటర్
విషాదం : తిరుమల కాలినడక మార్గంలో బీటెక్ విద్యార్ధి మృతి
బీఫ్ తినేవారి విరాళం అయోధ్యకు వద్దన్న ఎమ్మెల్యే రాజాసింగ్..ఓయూ విద్యార్థుల మండిపాటు
ఎలక్షన్ టైమ్‌లో టీఆర్ఎస్, బీజేపీలో అంతర్గత విబేధాలు
జగన్ ప్రభుత్వం పరువు తీస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత తీవ్ర ఆరోపణలు