లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘ఆచార్య’ లో సిద్ధ రోల్ ఏంటంటే..

Published

on

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభమైంది. చిరు సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. సోనూ సూద్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కొణిద‌ెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌‌పై రామ్‌ చ‌ర‌ణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ లో చరణ్ క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చరణ్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుందట.

మెగా పవర్‌స్టార్ ఈ సినిమాలో అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్‌ సిద్ధగా కనిపించనున్నాడని.. దాదాపు 30 నుండి 35 నిమిషాల పాటు సాగే ఈ క్యారెక్టర్ కథను మలుపుతిప్పుతుందట. చెర్రీ సరసన పూజా హెగ్డే కథానాయికగా ఫిక్స్ అయ్యింది. ‘రంగస్థలం’ లో స్పెషల్ సాంగ్ చేసిన పూజా.. చరణ్‌తో మొదటిసారి హీరోయిన్‌గా నటిస్తోంది.