లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘ఆచార్య’ ఆన్ ది వే.. చరణ్‌ని చూపిస్తారా?

Published

on

Acharya Teaser Update: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌‌పై రామ్‌ చ‌ర‌ణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’ టీజర్ అప్‌డేట్ వచ్చేసింది.. ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఎట్టకేలకు వారికి సర్‌ప్రైజ్ ఇస్తూ.. జనవరి 29 సాయంత్రం 4:05 గంటలకు ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

మెగా పవర్‌స్టార్ ఈ సినిమాలో అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్‌ సిద్ధగా కనిపించనున్నాడని.. దాదాపు 30 నుండి 35 నిమిషాల పాటు సాగే ఈ క్యారెక్టర్ కథను మలుపుతిప్పుతుందని సమాచారం. చెర్రీ పక్కన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

‘ఆచార్య’ లో సిద్ధ రోల్ ఏంటంటే..

కాగా చరణ్‌ది తక్కువ నిడివి ఉంటే పాత్ర కాబట్టి టీజర్‌లో తనని చూపించే అవకాశాలు చాలా తక్కువ. మెగాస్టార్, మెగా పవర్‌స్టార్ ఇద్దరినీ స్క్రీన్ మీద చూడాలంటే మెగాభిమానులు సినిమా రిలీజ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఈ సినిమాకి సంగీతం : మణి శర్మ, కెమెరా : తిరు, ఎడిటింగ్ : నవీన్ నూలి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : కొరటాల శివ.