‘యాక్టింగ్ అనేది క్షమాపణ లేని ప్రొఫెషన్’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Manoj Bajpayee: బాలీవుడ్ స్టార్, ఫ్యామిలీ మ్యాన్‌గా వెబ్ సిరీస్‌లో కనిపించిన మనోజ్ బాజ్‌పేయీ యాక్టింగ్ కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన ట్రైనింగ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో దిగిపోతే క్షమించేసి సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండదు. వేరే ప్రొఫెషన్‌లలాగే యాక్టింగ్ కూడా.. ఓ స్టెబిలిటీని కోరుకుంటుంది.

‘ప్రతి ఒక్కరికీ నేను ఇదే చెప్తుంటాను. కుదిరినన్ని సార్లు ప్రాక్టీస్ చేయండి. చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇది నాలుగు నెలలు, ఆరు నెలలు, సంవత్సరంలో వచ్చేసేది కాదు. ఇదొక ఆన్‌గోయింగ్ ప్రోసెస్’ అని బాజ్‌పేయ్ అంటున్నారు.నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్… సినిమా ఫీల్డ్‌లో ట్రైనింగ్‌కు ఉన్న ఇంపార్టెంట్
గురించి చెబుతున్నారు. ‘ఇది క్షమాపణ లేని ప్రొఫెషన్. దేనికంటే ఆల్రెడీ అదే అవకాశం కోసం బోలెడు మంది ఎదురుచూస్తూ ఉంటారు. మీరు చేసే పనిలో బెస్ట్ గా ఉంటేనే అవకాశాలు వస్తాయి’ అని చెప్పారు.

1998లో వచ్చిన సత్య సినిమాలో భూకూ మాత్రే పాత్రలో కనిపించిన మనోజ్… బ్యారీ జాన్ స్టూడియోలో ట్రైనింగ్ తీసుకున్నారు.

అద్భుతమైన సినిమాల్లో కనిపించిన బాజ్‌పేయీ.. పింజార్, షూల్, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, అలీఘర్, స్పెషల్ 26లలో ఇంప్రెసివ్ పర్‌ఫార్మెన్స్ చేశారు. రెండు దశాబ్దాల తర్వాత గానీ, తనకు క్యారెక్టర్ ను అవగతం చేసుకోవడం కుదరలేదని ఆయనే అంటున్నారు.

‘కుదిరినన్ని సార్లు స్క్రిప్ట్‌లు చదువుతా. ప్రాక్టీస్ చేస్తా. క్యారెక్టర్ లోకి వెళ్లిపోవడానికి చాలా టైం పడుతుంది. మీకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది పేపర్ మీద మాత్రమే ఉంటుంది. దానికి మీ టాలెంట్ తోనే ప్రాణం పోయాలి. క్యారెక్టర్‌ను బట్టి నేనెలా అప్రోచ్ అవ్వాలో డిసైడ్ అవుతాను’ అని బాజ్‌పేయీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ద ఫ్యామిలీ మ్యాన్ లో కనిపించిన మనోజ్.. టాలెంట్ నిరూపించుకోవడానికి ఇవి సరైన వేదికలని చెప్తున్నాడు. అంతేకాకుండా ‘ఇండస్ట్రీలో ఇదొక బెటర్ ప్లేస్. ప్రతిఒక్కరూ కోరుకునేది ఇదే. మంచి ప్లేస్ వైపుకే మనం వెళ్తున్నాం. వారిలో నేనొకరిని. ప్రవాహానికి ఎదురీదాలనుకున్నప్పుడు పరిస్థితులు కష్టంగా మారతాయి’ అని ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫాంల గురించి వెలిబుచ్చాడు.

ఓటీటీల కంటే సినిమా థియేటర్లకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అభిమానులు థియేటర్లకు వెళ్లే ముందు ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారని చెబుతున్నాడు.

Related Tags :

Related Posts :