లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Fact Check : వ్యాక్సిన్ వేయించుకున్నట్లు యాక్టింగ్ ? వీడియోలు వైరల్

Published

on

Acting as if vaccines : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు నటించి కెమెరాలకు చిక్కిన ఇద్దరు ఉన్నతాధికారుల నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి…ప్రజలను చైతన్యపరచాల్సింది పోయి…వ్యాక్సిన్ విషయంలో తు.తు మంత్రంగా…కెమెరాలకు ఫోజులు ఇవ్వడం ఏంటీ ? అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. కర్నాటక రాష్ట్రంలోని తూమ్కూరు జిల్లా…ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్య శాఖ అధికారులు…నాగేంద్రప్ప, రజనీలు ఇద్దరూ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు నటించినట్లు స్పష్టంగా…వీడియోలో కనిపిస్తోంది.

ఇంజక్షన్ సూదీని వారి భుజానికి ఆనిచ్చుకున్నారు..కానీ…వ్యాక్సిన్ వేయించుకోలేదు. కేవలం మీడియా కవరేజ్ కోసం…ఫోజులు పెట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన…ప్రజలు ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందా ? లేదా ? ప్రభుత్వం ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు…కరోనా వ్యాక్సినేషన్‌లో ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించిన దేశంగా భారత్‌ నిలిచింది. ఆరురోజుల్లో 10 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చిన తొలి దేశంగా భారత్ అవతరించింది. దేశవ్యాప్తంగా నిన్నటితో ఆరవ రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. టీకా డ్రైవ్‌ ప్రారంభం రోజు జనవరి 16 నుంచి నిన్నటి వరకు 10 లక్షల 40 వేల 14 మందికి భారత్ వ్యాక్సిన్‌ వేసింది. దీంతో కొత్త రికార్డులను నెలకొల్పింది.