Action Telugu Trailer

‘యాక్షన్‌’ ట్రైలర్‌ చాలా చాలా బాగుంది : పూరి జగన్నాధ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’యాక్షన్‌’ తెలుగు ట్రైలర్ విడుదల చేసిన పూరి జగన్నాధ్..

విశాల్, తమన్నా జంటగా, ప్రముఖ దర్శకుడు సుందర్. సి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్.. ‘యాక్షన్’.. విశాల్, సుందర్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ‘యాక్షన్’ తమిళ్ థియేట్రికల్ ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘గద్దలకొండ గణేష్‌’, ‘హుషారు’, ‘రాజుగారి గది 3’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ‘యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ శుక్రవారం విడుదల చేశారు. “మా ఇస్టార్ట్‌ డిస్ట్రిబ్యూటర్‌, ఇస్మార్ట్‌ శ్రీను శ్రీకార్తికేయ సినిమాస్‌ బేనర్‌పై ‘యాక్షన్‌’ సినిమాతో ఫస్ట్‌టైమ్‌ ప్రొడ్యూసర్‌ అవుతున్నాడు. ‘యాక్షన్‌’ సినిమా ట్రైలర్‌ ఇప్పుడే చూశాను. చాలా చాలా బాగుంది. విశాల్‌  తమన్నాల కెమిస్ట్రీ అదిరిపోయింది. సుందర్‌ సి. తన డైరెక్షన్‌తో చింపేశారు. ఫోటోగ్రఫీగానీ, ఎడిటింగ్‌గానీ, ప్రొడక్షన్‌ వేల్యూస్‌గానీ, చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి. మా శీనుకి ప్రొడ్యూసర్‌గా పెద్ద సూపర్‌హిట్‌ రావాలి. మంచి డబ్బులు రావాలి. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ టు ది టీమ్‌” అన్నారు పూరి.

Read Aso : కార్తీ ‘ఖైదీ’ సినిమాపై మహేష్ ప్రశంసలు!

రాంకీ, యోగిబాబు, ఐశ్వర్య లక్ష్మీ, ఆకాంక్ష పూరి, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్‌లో ‘యాక్షన్’ విడుదల కానుంది. సంగీతం : హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ : డుడ్లీ, ఎడిటింగ్‌ : ఎన్‌.బి.శ్రీకాంత్‌, నిర్మాత : శ్రీనివాస్‌ ఆడెపు, దర్శకత్వం : సుందర్‌ సి.

 

Related Posts