లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

దేశవ్యాప్త ఆందోళనల తర్వాత… JJ Hospitalకు వరవరరావు తరలింపు

Published

on

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తలోజా జైలు నుంచి 2020, జులై 13వ తేదీ సోమవారం ఆయన్ను నవీ ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. 81 సంవత్సరాల వయస్సున్న వరవరరావు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని Sir JJ Hospital డీన్ డాక్టర్ రంజిత్ వెల్లడించారు.

గతంలో ఆసుపత్రిలో చేరిపించినా…అతను పూర్తిగా కోలుకుండానే…డిశ్చార్జ్ చేశారని వెల్లడిస్తూ…తెలంగాణ ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, కుటుంబసభ్యులు కోరిక మేరకు జేజే హాస్పిటల్ కు తరలించారు.

2018, ఆగస్టు 31వ తేదీన అరెస్టు చేసినప్పటి నుంచి..జైలులోనే ఉంచారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై రావు కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. జులై 11వ తేదీన వరవరరావుతో తాము మాట్లాడడం జరిగిందని, తర్వాత ఇంతవరకు మాట్లాడలేదని వెల్లడిస్తున్నారు.

ఆయన నడవలేని స్థితిలో ఉన్నారని అక్కడున్న తోటి ఖైదీ తమకు సమాచారం ఇచ్చాడని, రోజు వారి పనులు చేసుకొనేందుకు ఆయనకు సహాయం అవసరమన్నారు. తన తండ్రి electrolyte imbalance వ్యాధితో బాధ పడుతున్నాడని, చికిత్స చేయకపోతే..ప్రమాదమని కూతురు పవన తెలిపారు.

ప్రస్తుతం కరోన వైరస్ విస్తరిస్తున్న క్రమంలో తక్షణమే ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య రీత్యా వెంటనే ఆయన్ను విడుదల చేయాలని People’s Union for Democratic Rights డిమాండ్ చేసింది. జైలులో ఉన్న వారి ఆరోగ్యం చూడడంలో జైలు సిబ్బంది విఫలమయ్యారని పౌర సమాజ సభ్యుల బృందం రోమిలా థాపర్, ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవకి జైన్, సతీష్ దేశ్ పాండే విమర్శించారు.

గత కొంతకాలంగా వరవరరావు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. భీమా కోరెగావ్ కేసులో వరవరరావును కీలక నిందితుడిగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది. అందుకే బెయిల్ ఇవ్వొద్దని కోరడంతో కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్ లో పోలీసులు అరెస్టు చేశారు. పూణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. 2020, ఫిబ్రవరి నెలలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.

కానీ..ఈ జైలులో కరోనా వ్యాధితో ఒకరు చనపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో..తమ తండ్రిని విడుదల చేయాలని వరవరరావు కుమార్తెలు మహారాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ లకు లేఖలు రాశారు.