లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

యూట్యూబ్ ఛానెల్‌కు రూ.500కోట్ల పరువు నష్టం నోటీసులు

Published

on

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును తప్పుగా ప్రస్తావించినందుకు నటుడు అక్షయ్ కుమార్.. ఓ యూట్యూబర్‌కు రూ.500కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసి, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరును లాగినందుకు పోలీసులు గతంలో అరెస్టు చేసిన యూట్యూబర్ రషీద్ సిద్దిఖీపై ఇప్పుడు 500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు అక్షయ్.బీహార్‌కు చెంది యూట్యూబర్‌ రషీద్ సిద్దిఖీ ‘ఎఫ్ఎఫ్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుడు సమాచారం, దుర్వినియోగ వీడియోలను పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి యు-ట్యూబర్ తప్పు వీడియోలను తయారు చేసి అప్‌లోడ్ చేశాడు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత, ముంబై పోలీసులు యు-ట్యూబర్‌పై కేసు నమోదు చేశారు, అయితే దర్యాప్తులో పోలీసులతో సహకరిస్తాను అనే షరతుపై అతనికి బెయిల్ లభించింది.యు-ట్యూబర్ రషీద్ సిద్దిఖీ వయస్సు 25 సంవత్సరాలు. రషీద్ బీహార్‌కు చెందినవాడు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. ‘ఎఫ్ఎఫ్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు, దీనిపై ముంబై పోలీసులు, ఆదిత్య ఠాక్రే మరియు అక్షయ్ కుమార్ లపై కొన్ని అవమానకరమైన వీడియోలను పోస్ట్ చేశారు. శివసేన లీగల్ సెల్ తరపు న్యాయవాది ధర్మేంద్ర మిశ్రా రషీద్‌పై కేసు పెట్టారు. దీని తరువాత ముంబై పోలీసులు రషీద్‌పై పరువునష్టం, బహిరంగ దుశ్చర్య మరియు ఒకరిని ఉద్దేశపూర్వకంగా అవమానించారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అయితే రషీద్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అక్షయ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు, ఇందులో సుశాంత్ ‘ఎంఎస్ ధోని’ సినిమా పొందడం పట్ల అక్షయ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నాడని తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేశారు. ఇది మాత్రమే కాదు, సుశాంత్ మరణం విషయంలో, అక్షయ్ ఆదిత్యతో రహస్యంగా సమావేశమై రియాను కెనడాకు పంపించడానికి సహాయం చేసినట్లుగా కూడా ఉంది. ఇప్పుడు మొత్తం విషయం వెలుగులోకి వచ్చిన తరువాత, అక్షయ్ అదే కారణంతో రషీద్‌కు పరువు నష్టం నోటీసు పంపాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *