బక్రీద్ పర్వదినాన..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తనకు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు కమెడియన్ అలీ. బక్రీద్ పండుగ పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అలీ.. మణికొండలోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అంతేకాకుండా ఆయన కూడా మరో ఇద్దరికి ఈ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ గారి సారధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎం.పి సంతోష్ కుమార్‌గారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను నా సోదరుడు ఖయుమ్, బావమరిది కరీంలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటాలని కోరుతున్నాను..’’ అని తెలిపారు.Actor Ali


Related Posts