నా పెళ్లికి రండి సార్! సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన నితిన్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జూలై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు హీరో నితిన్. ఈ పెళ్లిపై ఇప్పటికే అధికారిక సమాచారాన్ని విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌వారు, స‌న్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజ‌ర‌వ‌నున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తన పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లారు. పెళ్లికి హాజరై మా దంపతులను ఆశీర్వదించాలని కేసీఆర్‌ను నితిన్ కోరారు. Nithin- Shalini వాస్తవానికి ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరపాలని నితిన్, షాలినిల కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ కరోనా రూపంలో వారి పెళ్లి సాధారణంగానే జరగబోతోంది. అయితే తెలంగాణ స్టార్ హీరో అయిన నితిన్ వేడుకకు సీఎం కేసీఆర్‌తో పాటు మరికొంత మంది పెద్దలను కూడా ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట’ సినిమాలు చేయ‌నున్నారు.

Related Posts