పవన్ ప్రశంసకి సత్యదేవ్ పొంగిపోయాడు.. ఎందుకంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pawan Kalyan Compliment: పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులు, అభిమానులతో పాటు వివిధ భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. వారందరికీ పవన్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ హీరో సత్యదేవ్ కూడా పవన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ‘Happy Birthday to the one and only Power Star Pawan Kalyan Sir’.. అంటూ పవన్‌తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేశాడు.ఈ ట్వీట్‌కు పవన్ స్పందిస్తూ.. ‘‘ధన్యవాదాలు సత్యదేవ్‌ గారు. మీ లేటెస్ట్ సినిమా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో మీ నటనను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆల్ ది బెస్ట్’’ అని రిప్లై ఇచ్చారు. పవన్ నుంచి వచ్చన ఈ ప్రశంసతో సత్యదేవ్‌ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంతలా మారిపోయింది.

ఏపీలో కొనసాగుతున్న కరోనా కేసులు


‘‘సర్.. థ్యాంక్యూసోమచ్.. మీ ప్రశంసను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ పుట్టిన రోజునాడు నాకు బహుమతి అందించినందుకు మరోసారి థ్యాంక్యూ సర్. మీ మెసేజ్‌తో మా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీమ్ మొత్తం చాలా సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేశాడు. కాగా ఇటీవల సత్యదేవ్ నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం చూసి స్వయంగా మెగాస్టార్ తన ఇంటికి పిలిచి సత్యదేవ్‌ను అభినందించారు. అలాగే చిరు పుట్టినరోజు సందర్భంగా ‘ఠాగూర్’లోని కొడితే కొట్టాలిరా పాట వీడియోతో విషెస్ తెలియచేశాడు సత్యదేవ్.

Related Posts