లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

బాలీవుడ్ నటి కన్నుమూత

Published

on

actor-singer-divya-chouksey

ప్రస్తుతం బాలీవుడ్‌లో పరిస్థితి బాగాలేదు. వరుసగా కళాకారులు ఈ ప్రపంచానికి వీడ్కోలు పలుకుతున్నారు. అమితాబ్ బచ్చన్ సహా చాలా మంది కళాకారులు కరోనా వైరస్ సంక్రమణతో పోరాడుతున్న సమయంలో బాలీవుడ్‌లో మరొక విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి దివ్య చోక్సే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ‘హై అప్నా దిల్ తో అవరా’ చిత్రంతో 2016లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దివ్య క్యాన్సర్‌తో పోరాడుతూ చనిపోయారు.

ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పే ముందు దివ్య ఎమోషనల్ నోట్ రాశారు. మ‌రికొన్ని గంట‌ల్లో తాను ఈ లోకాన్ని శాశ్వితంగా వీడుతూ తన ఇన్‌స్టాస్టోరీలో.. ‘నేను చెప్పదలచుకున్నదానికి, ఈ పదం సరిపోదు. కొన్ని లేదా అంతకంటే ఎక్కువ, కానీ నేను నెలల తరబడి కేన్సరుతో పోరాడుతూ మంచం మీద ఉన్నాను…దివ్య చౌక్సే బై ’ అంటూ చివ‌రి మాటలను రాశారు.

దివ్య లండన్ నుండి యాక్టింగ్ కోర్సు చేశారు. దీని తరువాత ఆమె చాలా కాలం మోడలింగ్‌లో చురుకుగా ఉంది. చాలా టీవీ షోలు మరియు సినిమాల్లో పనిచేసింది. సోషల్ మీడియాలో నెటిజన్లు దివ్యకు నివాళి అర్పిస్తున్నారు. దివ్య సహనటుడు సాహిల్ ఆనంద్.. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చనిపోయిన విషయాన్ని వెల్లడించారు. ‘‘మీ అభిరుచి, కల, సినీపరిశ్రమపై మీ సానుకూలత, మీ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక, మీ జ్ఞాపకాలు నా హృదయంలో సజీవంగా ఉంటాయి’’ అని సాహిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *