లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

తమిళనాడులో సీఎం జగన్ ఫొటోలు : నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ?

Published

on

Actor Vijay Fans Poster With Andhrapradesh Chief Minister Jagan Mohan Reddy

ప్రముఖ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా ? ఆయన రాజకీయాల్లో రావాలని తండ్రి, సీనియర్ దర్శకులు చంద్రశేఖర్ తో పాటు అభిమానులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే..తమిళనాడులో సీఎం జగన్ ఫొటోలు ఎందుకు కనిపిస్తున్నాయి ?

విజయ్ తో పాటు జగన్ ఉన్న ఫ్లెక్సీలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా.. మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. దీంతో ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.

ఈ క్రమంలో 2020, జూన్ 22వ తేదీ సోమవారం విజయ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. కుంభకోణంలోని ఆయన ఫ్యాన్స్ వాల్ పోస్టర్లు అతికించి విషెస్ తెలియచేస్తున్నారు. అయితే ఫ్లెక్సీలో సీఎం జగన్ ఫొటో ఉండడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా విజయ్‌ ఘనవిజయం సాధించి తమిళనాడును పాలించేందుకు రానున్నారు’ అనే నినాదం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.

‘కుంభకోణం విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ తరఫున అతికించిన ఈ పోస్టర్లలో రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న ‘సర్కార్‌’ అనే నినాదాన్ని సైతం ఆ పోస్టర్లలో కనిపిస్తోంది. ఇలాంటి ఫొటోలు ఇతర ప్రాంతాల్లో కూడా వెలుస్తున్నాయి. 

అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలపై విమర్శలు గుప్పిస్తూ…2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మరి విజయ్ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

Read: ధోని బయోపిక్‌ సినిమాలో అక్షయ్ కుమార్ ను కాదని సుశాంత్ ను తీసుకున్నా : దర్శకుడు నీరజ్‌ పాండే

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *