లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

పెయిన్ రిలీఫ్ ఆయిల్ : గోవిందా, జాకీష్రాఫ్‌లకు రూ. 20 వేల ఫైన్

Published

on

Actors Govinda, Jackie Shroff Fined Rs. 20,000

ఓ యాడ్ ఇద్దరు సీనియర్ హీరోలైన గోవిందా, జాకీష్రాఫ్‌లకు చిక్కులు తెప్పించి పెట్టింది. వినియోగదారులు వేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ హీరోలకు ఫైన్ వేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్‌లో చోటు చేసుకుంది. 2012లో జులైలో ఈ కేసు వేశారు. 2019, నవంబర్ 24వ తేదీన కోర్టు తీర్పును చెప్పడం విశేషం. 

పెయిన్ రిలీఫ్ ఆయిల్ యాడ్‌లో గోవిందా, జాకీష్రాఫ్‌లు నటించారు. 15 రోజుల్లో నొప్పి తగ్గుతుందని వాళ్లిద్దరూ యాడ్‌లో చెప్పడం జరిగింది. అది నిజమే అనుకుని అభినవ్ అగర్వాల్ ఆయిల్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. రూ. 3 వేల 600 పెట్టి..తన తండ్రికి ఇచ్చాడు. తీరా చూస్తే..ఎన్ని రోజులైనా..నొప్పి తగ్గలేదు. ఇతను లాయర్ కావడంతో మధ్యప్రదేశ్ కంపెనీ ప్రతినిధికి ఫోన్ చేసి విషయం తెలియపరిచాడు.

బాటిల్ తిరిగి ఇచ్చేయాలని, డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని అతను చెప్పాడు. అయితే..బాటిల్ ఇచ్చేసినా..డబ్బులు ఇవ్వలేదు. సెలబ్రెటీలు యాడ్ చెయ్యడం వల్లే తాను దానిని కొనడం జరిగిందని, తాను మోసపోయానంటూ వినియోగదారుల కోర్టు మెట్లు ఎక్కారు. ఇదంతా 2012లో జరిగింది. అప్పటి నుంచి విచారణ కొనసాగింది. చివరకు గోవిందా, జాకీష్రాఫ్, టెలీ మార్ట్ షాపింగ్ నెట్ వర్క్ ప్రై.లి., మాక్స్ కమ్యూనికేషన్‌లకు రూ. 20 వేలు పరిహారంగా బాధితుడికి ఇవ్వాలని ఆదేశించింది.

అలాగే బాటిల్ ధర రూ. 3 వేల 600 వెనక్కి ఇచ్చేయడంతో పాటు..9 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని ఆదేశించింది. బాధితుడికి కోర్టు ఖర్చులు, లాయర్ ఖర్చులను కూడా చెల్లించాలంది కోర్టు సూచించింది. 
Read More : చెర్రీ, అలియా ఆటాడుకుంటున్నారు! రొమాంటిక్ సాంగ్ షూట్‌లో ‘RRR’

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *