మీ తీరు హాస్యాస్పదం: పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న పీకే ఫ్యాన్స్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Actress Madhavi Latha about Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీర వినయ విధేయురాలు, బీజేపీ లీడర్, నటి మాధవీలత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. పవన్‌ను గురించి పోస్ట్ అంటే గతంలోలా ఆయన్ని ప్రేమిస్తున్నాననో.. లేక ఆయనపై ప్రేమను కురిపిస్తూ పొగడ్తలు వంటివో కాదండోయ్.. అమ్మడు ఈసారి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసింది.


‘డియర్ పవన్ కళ్యాణ్.. మీకు ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా డైరెక్ట్‌గా పెట్టలేదు. నేను ఎపుడో కాలేజీ లో ఉన్నపుడు రాసుకున్న ప్రేమ లేఖ తప్ప డైరెక్ట్‌గా లేఖ రాయలేదు. నా ఫేస్బుక్ వేదికగా రాస్తున్నా. అసలు ఎక్కడో నార్త్ స్టేట్స్ నుండి వచ్చి మీరెవరో తెలీకుండా.. తెలుగు ప్రజలకోసం మీరు పడే తపన కష్టం తెలీకుండా.. మీ భావాలు ఏంటో అర్ధం కాకుండా… మీ భాష ఏంటో తెలీకుండా మీ బాధ ఏంటో తెలీకుండా… ఇలా గాలి సోకితే వచ్చి ఇక్కడ నాలుగు సినిమాలు చేసుకుని మళ్ళీ వాళ్ళ ఊరు చెక్కేసే వాళ్ళు… మీ మీద ఎనలేని ప్రేమ గౌరవం ఉందని ఎన్నడూ లేని విధంగా ఈ పుట్టిన రోజు మొక్కలు నాటండి.. కుక్కలు పెంచండి.. ఆవుని పెంచండి.. పాలు తాగండి అని మీ అట్టెన్షన్ కోసం ఎదో వాళ్ళ మేనేజర్స్ మరియు పీఆరోఓలు చెప్తే యాక్షన్ కట్ అన్నట్లు వాళ్ళు చేస్తే అది చూసి మీరు మీ సోషల్ మీడియా వేదికగా వారికి సమాధానం ఇవ్వడం హాస్యాస్పదం.


మీరంటే నాకు అభిమానం అది ఎపుడూ పోదు.. అలా అని మీరేం చేసిన రైటో రైట్ అని నేనెపుడు స్టేట్మెంట్స్ పెట్టను. అసలు పోయిన ఏడాది మీరు పోటీ చేస్తుంటే ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్ అని ఒక పోస్ట్ పెట్టలేని వాళ్ళు.. జనసేనానిని గెలిపించండి అనలేని వాళ్ళు.. కనీసం మీ మీద ఎన్నో పుకార్లు పుట్టినపుడు I CONDEMN అని పోస్ట్ పెట్టలేని వాళ్ళకి మీ మీద ఈ రోజు ప్రేమ కారిపోవడం ఆ కారిన ప్రేమ మీరు బకెట్స్‌లో నింపుకోవడం నాకు చాలా కోపం తెప్పించింది. మీ నిజమైన అభిమానులకి పెట్టండి రిప్లై.


ఇక్కడ సెలెబ్రిటీలకి పెట్టే అవసరమే లేదు… ఎవడికి మీ మీద ప్రేమ లేదు… పైగా మిమ్మల్ని బద్నామ్ చేయాలనీ కొంతమంది నటీమణులు ఛానల్ మెట్లు ఎక్కుతున్నారు.అభిమానం ఉంటే కనీసం వాళ్ళ జీవితంలో మీ కోసం ఒక పోస్ట్ అయినా పెట్టేవాళ్ళు.. మీ జన సైనికులకు పేరు పేరున టైం ఉంటే పెట్టండి. మీరు కాకపోతే మీ పేజీ అడ్మిన్స్ ఎవరో. అంతేతప్ప కెమెరాల కోసం వాళ్ళ పర్సనల్ మ్యానేజర్లు మీ దృష్టిలో పడటం కోసం పెట్టించే వాళ్ళకి మీరు నటిస్తూ ( ఫార్మాలిటీ ) కూడా పెట్టే అవసరం లేదు (upto ur wish).


మీరంటే ఎంతో ఇష్టమైన ఒక మాములు అమ్మాయిగా.. నేనెపుడు మీ నుండి ఏమి ఆశ పడలేదు.. జీవితంలో ఎపుడైనా కలిసినా కేవలం ఒక మంచి ఆశయం కోసం.. మంచి విషయం కోసం కలవాలి అనుకున్నా.. అలానే కలుస్తా.. నేను వేరే పార్టీ లో ఉన్న కూడా మీకోసం నేనెపుడు నా గొంతు వినిపించడం లో వెనకడుగు వేయలేదు. మీ మీద అలిగేషన్ చేసిన వాళ్ళు మా పార్టీలోకి వచ్చిన ఇప్పటికి ఒప్పుకోలేకపోతున్నా.. అదీ అభిమానం అంటే. నాకు స్క్రీన్ మీద తప్ప జీవితంలో నటన రాదు. నేనంటే నా పోస్ట్ ఇంతే.


అలాగే నా బిజేపీ పార్టీ మీమీద నాకున్న ఇష్టాన్ని అర్ధం చేసుకుంది , అందుకే ఎపుడు అడ్డు చెప్పలేదు. ఇలాంటి అబద్దపు అభిమానులకి మీరు సమాధానం ఇవ్వడం నాకు నచ్చలేదు. ఎవడేమనుకున్నా నాకు అనవసరం ఇది నా భావన. మీకు వీలైతే సినిమా ఇండస్ట్రీలో పేరుకున్న చెత్తని కడిగే ప్రయత్నం చేయండి. ప్రజల సంగతి తర్వాత చూద్దురు కానీ ఎలాగూ మిమ్మల్ని గెలిపించలేదు. దానికి టైం ఉంది ఇంకా.. ఇల్లు ( టాలీవుడ్) చక్కదిద్ది.. తర్వాత అమ్మ నా బూతులు తిట్టినా మీరు ప్రజల కోసం పని చేసారు.


సినిమా రంగం మీకు అడ్డుపడేంత స్థాయి లేదు.. మిమ్మల్ని తొక్కేంత సీన్ లేదు కనుక.. అక్కడ అమ్మాయిల జరుగుతున్న అత్యాచారాల మీద డ్రగ్స్ మీద పోరాటం మొదలు పెట్టండి. ఆల్రెడీ తెలుగు హీరోలకి తెలుగు రాదు అని దొబ్బులు పెట్టారు కదా పోయిన ఏడాది నాకు బాగా నచ్చింది అలానే చేయండి. కాదు నేను చేయలేను అంటే మీ ఇష్టం..


“నషా ముక్త్ భారత్“ (DRUGS FREE INDIA)కి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు. జనాలకి చెప్తున్నా నాకు సోషల్ మీడియా వేదికగా సమాధానం రాలేదు అనే కడుపు మంటతో పెట్టాను అనుకునేవాళ్ళకి అసలు నేనెపుడు ఆశ పడలేదు.. కల కనలేదు. నేను ఎపుడు ఒక మంచి కారణం కోసం కలవాలి అని వేచి చూస్తున్న అది అమ్మాయిల జీవితంలో కొంత పోరాటాన్ని ఉత్త్సహాన్ని నింపేదిగా ఉండాలి.
My post my report
Written by
Maadhavi latha pasupuleti.

READ  డైరెక్టర్ డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ అయ్యాడుగా!

Related Posts