కొంపముంచిన కిటో డైట్.. చికిత్సపొందుతూ నటి మృతి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Actress Mishti Mukherjee Passes away: ఈ కరోనా సమయంలో వరుస మరణాలు.. డ్రగ్స్ వ్యవహారంతో బాలీవుడ్ కుదేలవుతోంది. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి సినీ ప్రముఖులు కన్నుమూశారు. ప్రస్తుత పరిస్థితిలో చివరి చూపు కూడా చూసుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరో నటి మిష్టి ముఖర్జీ(27) కన్నుమూశారు.


మిష్టీ ముఖర్జీ పలు హిందీ, బెంగాలీ సినిమాల్లో ఐటమ్ నంబర్స్ చేశారు. ఆమె హఠాన్మరణంతో అభిమానులు షాక్ అయ్యారు. మిష్టీ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ, బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.


దీనికి కారణం ఆమె అధికంగా పాటించిన కిటో డైట్ అని, కిడ్నీ ఫెయిల్ అవడంతో మృతి చెందారని డాక్టర్స్ తెలిపారు. 2012లో ఆమె సినీ కెరియర్ ప్రారంభించిన మిష్టీ, ఐటమ్ నంబర్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆమెకు పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభించలేదు.


Related Tags :

Related Posts :