పవన్ బయోపిక్- వర్మకు పూనమ్ స్ట్రాంగ్ కౌంటర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొద్ది సేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు, ఆ సినిమా పేరు ‘పవర్ స్టార్’ అని తెలియచేస్తూ ఆ చిత్రంలో పవన్ క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తిని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. వర్మ అలా తన కొత్త సినిమా గురించి ప్రకటించాడో లేదో నటి పూనమ్ కౌర్ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

‘పవర్ స్టార్’ అనే సినిమాలో RGV అనే క్యారెక్టర్ కూడా యాడ్ చేయండి. అమ్మాయిల బలహీనతల గురించి తెలుసుకుని వారిని రెచ్చగొట్టి, వాళ్లకి ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పదజాలంతో ట్వీట్స్ పంపి, వాటిని షేర్ చేయమని చెప్పి, తర్వాత దాని గురించి మీడియాకు కూడా చెప్పమని చెబుతారు. నా చిన్నతనంలో మిమ్మల్ని గౌరవించేదాన్ని..ఇప్పుడు మిమ్మల్ని చూసి బాధపడుతున్నాను’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వర్మ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది పూనమ్. మరి ఈ ట్వీట్‌కి కాంట్రవర్సీ కింగ్ ఎలాంటి రిప్లై ఇస్తాడో చూడాలి.

Related Posts