actress pratyusha mohter waiting for justice since 17 years

ఈ దిశకు న్యాయమెప్పుడు : 17ఏళ్లుగా ప్రత్యూష తల్లి పోరాటం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మ శాంతిస్తుందా..? ఆమె కుటుంబ సభ్యులే కాదు.. సమాజం మొత్తం.. ఔననే అంటోంది. అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మ శాంతిస్తుందా..? ఆమె కుటుంబ సభ్యులే కాదు.. సమాజం మొత్తం.. ఔననే అంటోంది. అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత కిరాతకంగా హత్యచేసిన ఆ నలుగురిని మట్టుబెట్టడమే ఇలాంటి కేసుల్లో ఏకైక పరిష్కారమంటూ కొంతమంది కామెంట్లు కూడా చేశారు. మరి.. .. 17 ఏళ్ల క్రితం జరిగిన సినీనటి ప్రత్యూష హత్యాచారం ఘటన మాటేంటి? ప్రత్యూష ప్రాణాలు తీసిన నిందితులు ఇంతకాలం చట్టం నుంచి ఎలా తప్పించుకుని తిరుగుతున్నారు..? కామాంధుల రాక్షసత్వానికి బలైపోయిన ప్రత్యూషకు ఎందుకు న్యాయం జరగలేదనే అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

ప్రత్యూష… 20 ఏళ్ల వయసులోనే సినీ అరంగేట్రం చేసింది. అప్పుడప్పుడే కెరీర్ లో ఎదుగుతోంది. ఇంకా సెలబ్రెటీ హోదా కూడా రాలేదు. కానీ.. అంతలోనే ఆమె అనూహ్యంగా మరణించింది. 17ఏళ్ల క్రితం అంటే..  2002, ఫిబ్రవరి 23న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె మరణంపై అప్పుడు ఎన్నో అనుమానాలు, సందేహాలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా నిర్ధారణ అయిన సిద్ధార్థరెడ్డి జైలు శిక్ష అనుభవిస్తున్నా… ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. అనేక ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయ్. 

సిద్ధార్థరెడ్డి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారంలోనే ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ… ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారని ప్రత్యూష తల్లి ఆరోపించారు. ప్రత్యూషపై మూడుసార్లు రేప్ చేయడమే కాదు…విషం తాగించి చంపేశారని చెప్పారు. దీనివెనక అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులు ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయ్. ఫోరెన్సిక్ రిపోర్ట్‌ కూడా ఆ వాదనలకు బలం చేకూర్చింది. ప్రత్యూషపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశారని తేల్చింది. ప్రత్యూష శరీరంలో వీర్యపు ఆనవాళ్లున్నట్లు మునుస్వామి రిపోర్టిచ్చారు. కానీ… ఆ తర్వాత మునుస్వామి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ప్రత్యూష డెత్ సీక్రెట్ అలాగే ఉండిపోయింది.

ఈ దారుణంలో అప్పటి టీడీపీ, కాంగ్రెస్ నేతల కుమారుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చినా… వాటిని నిరూపించే సాక్ష్యాలు లేకుండాపోయాయి. మరోవైపు.. ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఎన్నో ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ వాదోపవాదాలు జరిగాయి. అయినా.. న్యాయం ఎప్పటికి దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ… న్యాయం ఇంకా బ్రతికే ఉందన్న నమ్మకంతో ఆమె పోరాడుతున్నారు. దిశ ఘటన నేపథ్యంలోనైనా తన కూతురి కేసు బెంచ్‌పైకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

READ  8న అలర్ట్ : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్‌లు బంద్

అయితే… దిశ కేసు తరహాలో ప్రత్యూషకు ఎందుకు సత్వర న్యాయం జరగలేదన్నది ఇపుడు అందరి మెదళ్లను తొలుస్తోంది. దిశ కేసు నిందితులు సామాన్యులవడం… ప్రత్యూష కేసు నిందితులు బడాబాబులు, రాజకీయనాయకుల పుత్రరత్నాలవడమే కారణమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. సమాజంలో వారికున్న పేరు, పలుకుబడి, డబ్బు.. వారిని కేసుల బారినుండి రక్షించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రత్యూష కేసు నిందితులు కూడా సామాన్యులై ఉంటే… సత్వర న్యాయం జరగకున్నా, ఏదో ఒక విధంగా న్యాయం మాత్రం జరిగి ఉండేది. ప్రత్యూష ఆత్మకు శాంతి అయినా చేకూరి ఉండేదని ఆమె తల్లి అంటున్నారు.

Related Posts