రోజా బర్త్‌డే సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Roja Birthday Celebrations: రోజా.. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకొన్నారు.. ఇప్పుడు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా సోమవారం రోజా తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు.


ఈ సందర్భంగా వెండితెర, బుల్లితెరపై అలరించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోజాకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక రోజా పుట్టినరోజు వేడుకలు ఆమె ఇంట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రోజా భర్త సెల్వమణి, కుమారుడు, కుమార్తెతో పాటు పలువురు బంధువులు పాల్గొన్నారు.


తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను రోజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బిజీ కారణంగా కొద్దికాలంగా రోజా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Roja Selvamani (@rojaselvamani)

Related Tags :

Related Posts :