లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

అల్లు అర్జున్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది!

పాపులర్ హీరోయిన్ షీలా వివాహం చెన్నైకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో జరిగింది..

Published

on

Actress Sheela Kaur gets Married

పాపులర్ హీరోయిన్ షీలా వివాహం చెన్నైకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో జరిగింది..

పలు తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి షీలా కౌర్ వివాహం ఘనంగా జరిగింది. చెన్నైకు చెందిన బిజినెస్‌మెన్ సంతోష్ రెడ్డిని ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య మనువాడింది. తమిళనాట విజయ్ హీరోగా నటించిన ‘వూవే ఉనక్కాగ’ చిత్రంతో బాలనటిగా పరిచయమైన షీలా..

అజిత్ హీరోగా, మురుగదాస్ దర్శకుడిగా పరిచయమైన ‘దీనా’ సినిమాలో లైలా చెల్లెలుగా, బాలా దర్శకత్వంలో సూర్య నటించిన ‘నందా’ చిత్రంలో సూర్య చెల్లెలుగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ ‘రాజుభాయ్’ సినిమాతో కథానాయికగా తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.

నవదీప్ ‘సీతాకోక చిలుక’, సాయి రామ్ శంకర్‌తో ‘హలో ప్రేమిస్తారా’.. రామ్‌తో ‘మస్కా’, బాలకృష్ణతో ‘పరమవీర చక్ర’  అల్లు అర్జున్ ‘పరుగు’, ఎన్టీఆర్ ‘అదుర్స్’ వంటి పలు సినిమాల్లో నటించింది. పలు తమిళ్, మలయాళం సినిమాల్లోనూ కథానాయికగా నటించిన షీలా కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. వివాహంతో కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన షీలాకు సినీ పరిశ్రమకు చెందినవారు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *