లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

నటి శ్రావణి ఆత్మహత్యకు కారణం ఇదే, ఆ ముగ్గురూ విలన్స్.. త్వరలోనే ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

Published

on

సంచలనం రేపిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ కొలిక్కి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు కారణం ఏంటో, కారకులు ఎవరో పోలీసులు తెలిపారు. సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డి, సినీ నిర్మాత అశోక్ రెడ్డి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆ ముగ్గురూ నిందితులే అని చెప్పారు.

ఈ కేసులో ఏ1 సాయికృష్ణారెడ్డి, ఏ2 నిర్మాత అశోక్ రెడ్డి, ఏ3 దేవరాజ్ రెడ్డి అని చెప్పారు. ఇప్పటికే సాయి, దేవరాజ్ లను అరెస్ట్ చేశామన్న పోలీసులు.. త్వరలోనే పరారీలో ఉన్న నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి కేసులో నిందితులు సాయి, దేవరాజ్ లను పోలీసులు సోమవారం(సెప్టెంబర్ 14,2020) మీడియా ముందు ప్రవేశపెట్టారు.

”ఆర్టిస్ట్ కావాలని శ్రావణి హైదరాబాద్ వచ్చింది. 2015లో తొలుత సాయికృష్ణా రెడ్డితో పరిచయం ఏర్పడింది. 2017లో సినీ నిర్మాత అశోక్ రెడ్డితో శ్రావణికి పరిచయం కలిగింది. ఓ సినిమాలో శ్రావణికి అశోక్ రెడ్డి చిన్న రోల్ ఇచ్చాడు. 2019 ఆగస్టులో దేవరాజ్ రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. అయితే దేవరాజ్ తో శ్రావణి స్నేహంగా ఉండటం సాయికి నచ్చ లేదు. దీంతో సాయి, శ్రావణికి పలు మార్లు ఘర్షణ జరిగింది. సాయి, శ్రావణి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. సాయి, శ్రావణి తల్లిదండ్రులు అంతా కలిసి శ్రావణిని వేధించారు. సాయి, నిర్మాత అశోక్, ఆమె పేరెంట్స్ అంతా కలిసి దేవరాజ్ కి దూరంగా ఉండాలని శ్రావణిని బలవంతం చేశారు.

సీరియల్ నటి సూసైడ్ కేసులో ట్విస్ట్‌లు.. కీలక ఆడియో లీక్!


పెళ్లి చేసుకుంటానని దేవరాజ్ శ్రావణిని నమ్మించాడు. అయితే శ్రావణికి ఉన్న సంబంధాలు చూసి అతడు ఆమెని దూరం పెట్టాడు. దీంతో శ్రావణి తీవ్ర మనస్తాపం చెందింది. ఓ వైపు సాయి, మరోవైపు నిర్మాత అశోక్, ఇంకోవైపు ఇంట్లో పేరెంట్స్.. అందరూ.. దేవరాజ్ కి కూడా దూరంగా ఉండాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చారు. ఆత్మహత్యకు ముందు శ్రావణి దేవరాజ్ తో చాలాసేపు మాట్లాడింది.

సాయి, అశోక్ తనను ఫిజికల్ గా వేధించారని శ్రావణి చెప్పింది. దేవరాజ్ శ్రావణిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు. ఆ తర్వాత అతడికి కొన్ని విషయాలు తెలిశాయి. దీంతో అతడు శ్రావణిని దూరం పెట్టాడు. ఇది తట్టుకోలేకపోయిన శ్రావణి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. దేవరాజ్, సాయి, అశోక్.. ముగ్గురిని ఈ కేసులో నిందితులుగా చేరుస్తున్నాము. ఏ1 సాయి, ఏ2 అశోక్, ఏ 3 దేవరాజ్ రెడ్డి. ముగ్గురూ నిందితులే. ఇప్పటికే సాయి, దేవరాజ్ ని అరెస్ట్ చేశాము. త్వరలో అశోక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తాం” అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *