దేవరాజ్ వల్లే అక్క ఆత్మహత్య చేసుకుంది, RX100 నిర్మాత చాలా మంచోడు.. టీవీ నటి శ్రావణి సోదరుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. గంటకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా శ్రావణి సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన అక్క ఆత్మహత్య చేసుకోవడానికి కారణం దేవరాజ్ రెడ్డి అని ఆరోపించాడు. అంతేకాదు, ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి చాలా మంచోడు అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. టెన్ టీవీతో మాట్లాడిన శ్రావణి సోదరుడు, దేవరాజ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. అసలు విలన్ దేవరాజ్ అని తేల్చాడు.

”దేవరాజ్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని మా అక్క శ్రావణి ఫిక్స్ అయిపోయింది, బట్టలు కూడా సర్దుకుంది. ఇన్ని గొడవలు జరిగాక దేవరాజ్ ని పెళ్లి చేసుకోకపోతే, బ్లాక్ మెయిల్ చేస్తాడని శ్రావణి భయపడింది. నేను వస్తాను, నన్ను తీసుకెళ్లు అని దేవరాజ్ ని అడిగింది. అయితే దేవరాజ్ పెళ్లి చేసుకునే రకం కాదు. అమ్మాయిలను ఎంజాయ్ చేసి వదిలేసే టైపు. ఇప్పటిదాకా దేవరాజ్ 10, 20 మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేశాడు.

దేవరాజ్ మీద కేసు ఉంది. అది తీయించుకోవడానికే దేవరాజ్ మా అక్కతో ప్రేమగా మాట్లాడాడు. కాల్ రికార్డ్స్ సేకరించాడు. ఫొటోలు తీసుకున్నాడు. అవన్నీ కోర్టులో చూపించి తనపై ఉన్న కేసుని తీయించుకోవాలని దేవరాజ్ అనుకున్నాడు. మా అక్కతో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. దేవరాజ్ ది ట్రూ లవ్ అని మా అక్క నమ్మేసింది.

మా అక్క శ్రావణి చెప్పిన ప్రకారం, ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. అశోక్ రెడ్డికి సంబంధించిన మూవీలో పని చేసింది. దాంతో ఆయనతో మా అక్కకి పరిచయం ఏర్పడింది. మా అక్కకు మంచి, చెడ్డ అన్ని విషయాలు చెప్పేవారు. సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అంతకు మించి ఏమీ లేదు. అశోక్ రెడ్డి చాలా మంచి వాడు అని మా అక్క చెప్పింది.

మూడు రోజులు షూటింగ్ అని చెప్పి నేను వచ్చేస్తాను. ఇద్దరమూ పెళ్లి చేసుకుందాము అని శ్రావణి దేవరాజ్ తో చెప్పింది. అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశం దేవరాజ్ కి లేదు. తనపై పెట్టిన కేసుని తీయించుకోవాలని అతడు అనుకున్నాడు. అయితే దేవరాజ్ నిజంగానే తనను పెళ్లి చేసుకుంటాడని శ్రావణి భ్రమలో ఉండిపోయింది. తన లగేజీ కూడా సర్దుకుంది. నేను మా అక్క లగేజీని చూశాను. కానీ అందులో షూటింగ్ కు సంబంధించినవి ఏవీ లేవు. అప్పుడు నాకు అర్థమైంది. శ్రావణి వెళ్లిపోవాలని అనుకున్న విషయం నాకు తెలిసింది” అని శ్రావణి సోదరుడు టెన్ టీవీతో చెప్పాడు.

READ  కుక్క మరణం: కేసు పెట్టిన పాటల రచయిత్రి

పూటకో ట్విస్ట్.. గంటకో ఆడియో, వీడియో లీక్స్‌తో మిస్టరీని తలపిస్తున్న నటి శ్రావణి కేసును ఓ కొలిక్కి తెస్తున్నారు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ను ఇప్పటికే పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించారు.

టీవీ నటి శ్రావణి చావుకు కారకులెవరు..? దేవరాజ్‌ రెడ్డా.. లేక సాయి రెడ్డా..? అసలు RX 100 నిర్మాత పేరెందుకు వచ్చింది..? ఇలాంటి ప్రశ్నలతో శ్రావణి సూసైడ్‌ కేసు క్రైమ్‌ సీరియల్‌ను తలపిస్తోంది. రోజుకో ట్విస్టుతో పోలీసులకే పిచ్చెక్కిస్తోంది. తొలత దేవరాజ్‌ను నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దేవరాజ్‌ అందించిన ఆధారాలతో ఇప్పుడు.. కేసు మొత్తం సాయి మెడకు చుట్టుకుంటోంది. హోటల్‌లో గొడవ జరిగిన రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీనే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదట దేవరాజ్ చుట్టూ కేస్‌ తిరిగితే.. ముచ్చటగా మూడో రోజు సాయి వైపు మళ్లింది. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ ఈ కేసులో పోలీసులకు కీలకమైన సాక్ష్యాలు అందించాడు.

Related Posts