హీరోయిన్స్ టాటూ సీక్రెట్స్ ఏంటో తెలుసా!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Actress Tattoos Secrets: ఇప్పుడంటే ‘పచ్చబొట్టేసినా.. పిలగాడా నిన్నే’.. అని టాటూలు చూస్తూ పాడుకుంటున్నారు కానీ పచ్చబొట్టు అనేది పదికాలాల పాటు చెరిగిపోని జ్ఞాపకం. పచ్చబొట్టే కాదు.. దానిపైన ఇష్టం కూడా చెరిగిపోలేదు. అసలు మన పూర్వీకుల్లో చాలామంది కచ్చితంగా పచ్చబొట్టు వేయించుకునేవారు.


పచ్చబొట్టు, టాటూ.. పేరు ఏదైనా అది మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. సినీ ప్రముఖులు ముఖ్యంగా హీరోయిన్లు టాటూలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. స్ఫూర్తినిచ్చే కొటేషన్లను, తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లను తమ శరీరంలోని వివిధ భాగాల్లో టాటూగా వేయించుకుంటుంటారు. అలా టాటూలు వేయించుకున్న హీరోయిన్ల వివరాలు మీకోసం..


సమంత: ప్రముఖ కథానాయిక సమంతకు టాటూలంటే మక్కువ ఎక్కువ. సమంత శరీరంపై మొత్తం మూడు టాటూలున్నాయి. ఇటీవలే తన పక్కటెముకలపై భర్త‘చైతన్య’ పేరును టాటూగా వేయించుకుంది. అంతకుముందు తన చేతిపై, వీపుపై కూడా సమంత టాటూలు వేయించుకుంది.Samanthaనయనతార: ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉండే లేడీ సూపర్‌స్టార్ నయనతార ‘పాజిటివ్’ అనే పదాన్నే తన ఎడమ చేతిపై టాటూగా వేయించుకుంది. అలాగే తన మెడపై మూడు సింబల్స్‌తో కూడిన టాటూ ఉంటుంది. దాన్ని అర్థం ఏమిటనేది మాత్రం నయన్ ఇప్పటివరకు వెల్లడించలేదు.
Nayantharaరష్మిక మందన్న: టాలీవుడ్ టాప్ హీరోయిన్, కన్నడ చిన్నది రష్మిక కూడా తన చేతిపై ఓ ప్రత్యేకమైన టాటూ వేయించుకుంది. ‘Irreplaceable’ (భర్తీ చేయలేనిది) అనే టాటూ వేయించుకుంది. Rashmika Mandannaశృతిహాసన్: శృతికి టాటూస్ అంటే పిచ్చి. ఆమె శరీరంపై చాలా టాటూస్ ఉన్నాయి. వీపుపై తన పేరు ‘శృతి’ టాటూని తమిళంలో వేయించుకుంది. అలాగే ఆమె చెవి కింద మ్యూజిక్ సింబల్‌ టాటూ కూడా ఉంది.
Shruti Haasanత్రిష: సీనియర్ కథానాయిక త్రిష టాటూ గురించి అందరికీ తెలిసిందే. త్రిష ఎద భాగంపై ఉండే నెమో టాటూ గురించి పెద్ద చర్చ కూడా జరిగింది. అలాగే ఇటీవల తన వీపుపై కెమెరా సింబల్‌ను, చేతి మణికట్టుపై లవ్ సింబల్‌ను టాటూగా వేయించుకుంది.

Trishaఅమలాపాల్: ఫిలాసఫీకి సంబంధించిన టాటూలు వేయించుకునేందుకు హీరోయిన్ అమలాపాల్ మొగ్గుచూపుతుంది. తన వీపుపై, కాలిపై అమల అలాంటి టాటూలనే వేయించుకుంది.
Amala Paulప్రియా ప్రకాష్ వారియర్:‘ఒరు ఆడార్ లవ్’ లో కన్నుగీటి కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన ప్రియా ఒంటిపై మూడు టాటూలు ఉన్నాయి.. కుడిచేతిపై రోజాపువ్వు, మెడపై తనకిష్టమైన చందమామ అలాగే ఎద భాగంలో మరో టాటూ వేయించుకుంది.
వీరితో పాటు పాపులర్ VJ రమ్య, హాట్ బ్యూటీ షాలు షమ్మూ వంటి ముద్దుగుమ్మలు కూడా తమకిష్టమైన టాటూలు వేయించుకున్నారు.Priya Prakash Varrier


Related Posts