ఆదా డ్యాన్స్‌కు ఆడియెన్స్ ఫిదా.. శ్రీదేవి సోడా సెంటర్‌లో సుధీర్ బాబు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

? Movie-Sridevi Soda Center: హాట్ బ్యూటీ ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘క్వశ్చన్‌ మార్క్‌ (?)’. శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మిస్తుండగా గౌరు ఘనా సమర్పిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ‘రామ‌స‌క్క‌నోడివిరో’ అనే పాట‌ను విడుదల చేశారు. ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం లిరిక్స్ రాశారు. మంగ్లీ పాడగా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఈ సాంగ్‌లో ఆదా శర్మ తనలోని డ్యాన్స్ టాలెంట్‌ను చూపించింది. స్టైలిష్ స్టెప్స్‌తో ఆకట్టుకుంది.


Sridevi Soda Center Motion Poster
సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న సుధీర్‌ బాబు హీరోగా నటించనున్న న్యూ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘భ‌లే మంచి రోజు, ఆనందో బ్రహ్మా, యాత్ర’ విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు.


విజయ్ చిల్లా, శశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ‘ప‌లాస 1978’ ఫేం క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనుందీ చిత్రం. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందించనున్నారు. మోష‌న్ పోస్ట‌ర్‌కి లీడ్ ఇస్తూ తాజాగా విడుద‌ల చేసిన ప్రీలుక్‌లో గోలీసోడా కేస్, జిమ్కీలైట్లు, వైర్లు, మ‌ల్లెపూల వంటి ఎలిమెంట్స్ పెట్టి ఆడియెన్స్‌కి క్యూరియాసిటీ కలిగించిన మూవీ యూనిట్‌.. అదే కంటిన్యూ చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Related Tags :

Related Posts :