దాల్చిన చెక్క, పసుపు, గ్రీన్ టీతో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడుకోవటానికి మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. శరీరాన్ని హనికలిగించే అనేక రకాల క్రిములు, వైరస్ లతో పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్ధ చాలా తోడ్పడుతుంది. అలాంటి ఎన్నో రకాల వైరస్ లను ఎదుర్కోటానికి మన శరీరాన్ని ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. సాధారణంగా గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలుసు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గ్రీన్ టీ తోను ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవటం గురించి తెలుసుకుందాం…
మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి, వ్యాధుల ప్రమాదాలని తగ్గించడానికి సహాయపడే పదార్థాలు ఈ హెర్బల్ టీ, గ్రీన్ టీ లలో ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. గ్రీన్ టీలో ఉండే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ కాటెచిన్.. గుండె జబ్బులను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా, మూత్రపిండాలు, కాలేయ పనితీరును పెంచడంలో ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి వాటి వల్ల సీజనల్ దగ్గు, జలుబు వంటి నుంచి రక్షించడానికి సహాయపడతాయి.

గ్రీన్ టీ తో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దాల్చిన చెక్క, పసుపు కలిపి తీసుకోవటం వల్ల మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడం, జీర్ణక్రియ, జీవక్రియలను మెరుగుపరిచే చర్యలను మరింత వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. దీనికి రోగ నిరోధక శక్తిని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క, పసుపు కలిపిన గ్రీన్ తయారు చేసే విధానం..
కావాల్సిన పదార్ధాలు :
1. గ్రీన్ టీ సాచెట్ (లేదా) 1.5 టీస్పూన్ గ్రీన్ టీ ఆకులు తీసుకోవాలి
2. ఒక దాల్చిన చెక్క (లేదా) 1/3 టీ స్ఫూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి
3. 1/3 టీ స్ఫూన్ పసుపు (లేదా) పసుపు కొమ్ము
4. అవసరమనుకుంటే రెండు పుదీనా ఆకులు, రుచికి అనుగుణంగా తేనె
5. కప్పున్నర నీళ్లు

తయారుచేసే విధానం (దాల్చిన చెక్క, పసుపు కొమ్ము)
step 1: ముందుగా కప్పున్నర నీళ్లలో దాల్చిన చెక్క, పసుపు కొమ్ము ఉంచి వేడిచేయాలి. ఒక కప్పు నీళ్లు అయ్యే వరకు ఆ మిశ్రమాన్ని మరగబెట్టాలి.step 2: తర్వాత మంటను ఆపివేసి వేడి నీటిలో గ్రీన్ టీ, పుదీనా ఆకులు వేసి మూత పెట్టాలి. అలా దానిని 5 నుంచి 6 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
step 3 : అనంతరం టీ ని కప్‌లోకి తీసుకుని తాగొచ్చు. అవసరమనుకుంటే రుచి కోసం కొంచెం తేనెను కలుపుకోవచ్చు.

READ  'సాహో' కోసం ఎనిమిది కిలోలు తగ్గిన - ప్రభాస్

దాల్చిన చెక్క పొడి, పసుపు తీసుకుంటే
step 1: ముందుగా నీటిని బాగా మరగబెట్టాలి.
step 2: ఆ తరువాత మంటను ఆపి, వేడి నీటిలో గ్రీన్ టీ, పుదీనా ఆకులు వేసి మూత పెట్టాలి. అలా దానిని 5 నుంచి 6 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.step 3 : అనంతరం మిశ్రమాన్ని కప్‌లోకి తీసుకుని దాల్చిన చెక్క పొడి, పసుపు కలిపి తాగొచ్చు. రుచి కోసం కొంచెం తేనెను యాడ్ చేసుకోవచ్చు.


Related Posts