సుశాంత్ నటించేందుకు నో చెప్పిన ఆదిత్య చోప్రా : కంగన సంచలన వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే హీరోయిన్ కంగనా రనౌత్..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాపై పలు విమర్శలు గుప్పించారు.

ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేకేత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో మాఫియా, చిత్ర పరిశ్రమలో నెలకొన్న అంశాలపై మాట్లాడారు.

ఆదిత్య చోప్రా ప్రొడక్షన్ హౌస్ తో సుశాంత్, రణ్ వీర్ సింగ్ కు ఒప్పందం ఉందని, ‘Goliyon Ki Raasleela Ram-Leela’ సినిమాలో హీరోగా సుశాంత్ నటించాలని సంజయ్ లీలా భన్సాలీ అనుకున్నారని, అయితే..ఆదిత్య చొప్రా ఒప్పుకోలేదన్నారు. సుశాంత్ కు బదులుగా రణ్ వీర్ నటించారని తెలిపారు.

ఆ తర్వాత..’Bajirao Mastani’ లో కూడా నటించాలని సంజయ్ అనుకున్నా..దీనిని కూడా ఆదిత్య నో చెప్పారని, కేవలం ఐదు సంవత్సరాల నటుడు అంటూ వెల్లడించారని తెలిపారు. అతని కెరీర్ ను దెబ్బ తీసే కారణం ఇదేనని స్పష్టం చేశారు. Nepotism గురించి తాను మాట్లాడినప్పుడు సుశాంత్ మద్దతిచ్చారని తెలిపారు.

‘Panga’ సినిమాలో కంగనా కనిపించింది. ‘Thalaivi’, ‘Dhaakad’ సినిమాలో నటించేందుకు కంగనా ఒప్పుకుంది.

మరోవైపు బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణం..పై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కాప్స్ తాజాగా ముంబై పోలీసులు Film Maker Aaditya Chopra స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వెర్సోవా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆదిత్య…ను బాంద్రా పోలీసులు విచారించారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగిందని తెలుస్తోంది.

2020, జూన్ 14వ తేదీన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన బాలీవుడ్ ను కుదిపేసింది. హిందీ పరిశ్రమలో జరుగుతున్న కారణాలు, గుత్తాధిపత్యం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు బాహాటంగానే విమర్శలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్స్ వినిపించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని రోజుల క్రితం టీవీ, నటుడు శేఖర్ సుమన్ ఓ ఫోరాన్ని ప్రారంభించారు.

Related Posts