ఒకే ఒక్క పాత్రతో ఆదిత్య ఓం “బందీ’’..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగు సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తుంది. కమర్షియల్ బాట నుండి కొత్త ప్రయోగాల వైపు దృష్టి సారిస్తుంది.. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ ప్రయోగాలను ఆదరించటం మంచి పరిణామం.. ‘లాహిరి లాహిరి లాహిరి’లో మొదలుకొని ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన హీరో ఆదిత్య ఓం.. ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు .ఈ చిత్రానికి “బందీ” అనే టైటిల్ ఖరారు చేశారు .

Bandhi హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ‘‘సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్రతో ఉంటుంది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమా తెలుగులో రావటం ఫస్ట్ టైం, ఆ అవకాశం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా వుంది. ఇంతకుముందు నన్ను ఎలా ఆదరించారో అలాగే ఇప్పుడు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ సందర్భంగా “బందీ”మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. లుక్ డిఫరెంట్‌గా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి దర్శకత్వం: రాఘవ.T , ఫొటోగ్రఫీ: మధుసూధన్ కోట, స్క్రీన్ ప్లే: రాకేష్ గోవర్థన్ గిరి.

Related Posts