స్మార్ట్ ఫోన్ల ధరలు పైపైకి.. దిగొస్తున్న స్మార్ట్ టీవీలు.. ఫ్యూచర్ ట్రెండ్ ఇదే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

స్మార్ట్ ఫోన్ల ఖరీదు పెరిగిపోతోంది. స్మార్ట్ టీవీల ధరలు మాత్రం రోజురోజుకీ దిగొస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో సరసమైన స్మార్ట్ టీవీలదే ట్రెండ్ నడవనుంది. ఒకవైపు స్మార్ట్ ఫోన్ల ఖరీదు పెరిగిపోతుంటే.. స్మార్ట్ టెలివిజన్లు రోజుకు తక్కువ అవుతున్నాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషుకులు. 32-అంగుళాల స్మార్ట్ టీవీ కోసం భారీగా ఖర్చు పెట్టే రోజులు పోయాయి. ఈ రోజు టీవీ మార్కెట్ వివిధ రకాల సరసమైన బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సరసమైన స్మార్ట్ టీవీ విభాగంలో లేటెస్ట్‌గా ఎంటర్ అయింది OnePlus స్మార్ట్ టీవీ.

వన్‌ప్లస్ టీవీ Q1 సిరీస్‌తో ప్రీమియం స్మార్ట్ టీవీ విభాగంలో దూసుకెళ్తోంది. ఈ బ్రాండ్ తన రెండవ ఇన్నింగ్స్‌కు మరింత సరసమైన స్మార్ట్ టీవీలతో రెడీ అవుతోంది. కొత్త వన్‌ప్లస్ సిరీస్ స్మార్ట్ టీవీకి సంబంధించి లీక్‌లు, స్నీక్ పీక్‌లతో మార్కెట్ సందడి చేస్తుంది. బ్రాండ్ లవర్స్ రాబోయే స్మార్ట్ టీవీ రేంజ్ గురించి మరిన్ని ఫీచర్ల వివరాలు తెలుసుకోవచ్చు. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరల్లో మార్కెట్లోకి రిలీజ్ చేసే దిశగా ప్లాన్ చేస్తోంది.

వన్‌ప్లస్ స్మార్ట్ టీవీల సరసమైన శ్రేణిలో రూ .1X, 999 నుంచి ప్రారంభమవుతుంది. కానీ అసలు X అంటే ఏంటి? అనే కదా మీ డౌట్… వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ రూ .20,000 లోపు ధరల మార్కెట్లో పోటీ పడుతుందని కంపెనీ రివీల్ చేసింది. షియోమి, VU, TLC వంటి పోటీదారులతో వన్‌ప్లస్ పోటీపడుతోంది. ఈ బ్రాండ్లంతా సరసమైన టీవీ విభాగంలో వేగంగా దూసుకెళ్తున్నాయి. వన్‌ప్లస్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. కొత్త డిజైన్లతో మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. వన్‌ప్లస్ తన సరికొత్త సరసమైన స్మార్ట్ టీవీలతో మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

గత ఏడాదిలో బెజిల్-లెస్ ప్రీమియం టీవీని ప్రవేశపెట్టిన తరువాత.. బ్రాండ్ కోసం ఈ ఏడాదిలో buzzword ఫ్రేమ్ లెస్ రానుంది. వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎలాంటి ఫీచర్లతో వన్ ప్లస్ రిలీజ్ చేస్తుందోని ఉత్సాహంగా ఉన్నారు. వన్‌ప్లస్ టీవీ కొత్త శ్రేణి బాడీ రేషియోకు 95 శాతం డిస్‌ప్లేను అందించనుంది. షీర్ మాట్టే బ్లాక్ గ్లాస్ షీట్‌తో కవర్ చేసి ఉంటుంది. ఈ రోజులో గ్రాండ్ వర్చువల్ లాంచ్ సందర్భంగా కొత్త వన్‌ప్లస్ టీవీ ఫస్ట్ లుక్ లైవ్ టెలిక్యాస్ట్ అయింది.

Related Posts