తక్కువ ధర వెంటిలేటర్లను తయారు చేసిన ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిల రోబోటిక్ టీమ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సను అందించటం కోసం కొంతమంది హైస్కూల్ విద్యార్దులు కలిసి తక్కువ రేటు, తేలికపాటి వెంటిలేటర్లను డిజైన్ చేశారు.

తూర్పు ఆఫ్ఘన్ లోని హెరాత్ నగరంలో 18 ఏళ్ల హైస్కూల్ విద్యార్ధి సోమమ ఫారు, మరో ఆరుగురు కలిసి వెంటిలేటర్లను ఆవిష్కరించారు. అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఆల్ మహిళా ఆఫ్ఘన్ రోబోటిక్స్ టీమ్ మార్చిలో ఓపెన్ సోర్స్, తక్కువ ధర వెంటిలేటర్ల తయారిని ప్రారంభించింది. ఈ వెంటిలేటర్లను మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహాయంతో తయారు చేయటానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టింది. తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణుల సలహాలను తీసుకున్నారు.

సాధారణ వెంటిలేటర్ల ధరతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చవుతుంది. వీటి ధర 700 డాలర్లు. వీటిని తేలికగా తీసుకు వెళ్లవచ్చు. ఈ వెంటిలేటర్లు బ్యాటరీ 10గంటల పాటు పని చేస్తుంది. అంతేకాకుండా మేము వైద్య రంగంలో మా మెుదటి అడుగు వేయగలిగాం. ప్రజలకు సేవ చేయగలిగినందుకు మా బృందమంతా సంతోషంగా ఉన్నారని ఫరూక్ రాయిటర్స్ తెలిపారు.

ఆరోగ్య శాఖ నుంచి తుది పరీక్ష జరిగి, ఆమోదం పొందిన తర్వాత వెంటిలేటర్లను ఆఫ్ఘన్ హాస్పటల్స్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అక్మల్ సంసోర్ తెలిపారు. అంతేకాకుండా ఈ వెంటిలేటర్లను మేము ఉపయోగిస్తాం, త్వరలోనే కంపెనీలతో ను ఒప్పందాలను కుదుర్చుకుంటాం అన్నారు. వీటిని మేము ఎగుమతి చేయగలుగుతాం అని ఆయన తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్ లో సుమారు 35వేల మంది ఈ మహమ్మారి భారీన పడినారు. ఇప్పటివరకు 1,181 మరణాలు సంభవించాయి.

Related Tags :

Related Posts :