లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఆయనకేమో ముగ్గురు భార్యలు : ఒక్క భార్యతోనే సరిపెట్టుకోండి..రెండోది వద్దంటూ సుద్దులు చెప్పిన చీఫ్

Published

on

Afghan Taliban Chief Restricts Officials to One Marriage : తాను మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలతో ఉంటూ ఇతరులకు మాత్రం ‘ఒక్క పెళ్లే చేసుకోండి..ఒక్క భార్యతోనే సరిపెట్టుకోండి రెండో భార్య వద్దంటూ నీతులు వల్లించాడు మిలిటెంట్ గ్రూప్ చీఫ్. తాలిబన్ కమాండర్లు, ఇతర నాయకులు బహుభార్యత్వానికి దూరంగా ఉండాలని మిలిటెంట్ గ్రూప్ చీఫ్ ముల్లా హిబతుల్లా ఆదేశాలు జారీ చేశారు.

విమర్శలు..సమస్యలు నేపథ్యంలో బహుభార్యాత్వంపై డిక్రీ జారీ
ఒకరికి మించి భార్యలు ఉండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయనీ..శత్రువుల నుంచి విమర్శలే కాకుండా సమస్యలు కూడా వస్తున్నాయని..కాబట్టి తాలిబన్ కమాండర్లు..ఇతర నాయకులకు ఒక్క భార్యకు మించి ఉండవద్దని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ లలో మిలిటెంట్ల హవా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ దేశాల్లో ముస్లింలలో పురుషులు ఒకేసారి నలుగురు భార్యలను కలిగి ఉంటుంటారు. అది వారికి తప్పుకాదు. ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సహా కొన్ని ముస్లిం దేశాల్లో ఇప్పటికీ బహుభార్యత్వం చట్టబద్ధంగా ఉంది. దీంతో ముస్లిం పురుషలు వారికి ఇష్టమైనన్ని పెళ్లిళ్లు చేసుంటారు. దానికి అతని భార్యలు కూడా అభ్యంతరం చెప్పరు. చెప్పనివ్వరు కూడా.

ఈ క్రమంలో బహుభార్యత్వం వల్ల సమస్యలు వస్తున్నాయని..కన్యాశుల్కం (వివాహం సమయంలో వారు వధువు తరపువారికి ఇచ్చే సొమ్ము) చెల్లించడానికి తాలిబన్ కమాండర్లు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని తాలిబన్ వర్గాలు భావిస్తున్నాయి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లోని పష్తూన్ తెగలలో పెళ్లి సమయంలో కన్యాశుల్కం (భారత్ లో ఎప్పుడో పోయింది) ఇచ్చే పద్ధతి ఈనాటికీ ఉంది. డబ్బు చెల్లించే ఆర్థిక శక్తి ఉన్నవారు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకుంటారు. అఫ్గానిస్తాన్ భవిష్యత్తు కోసం ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ ఆదేశాలు జారీ కావటం గమనించాల్సిన విషయం.

ఒకటి కంటే ఎక్కువ కుటుంబాల్ని పోషించటానికి బలవంతపు వసూళ్లు..విమర్శలు
అలా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని వారికి పిల్లల్ని కంటే వారికి దానికి తగినంత డబ్బు ఉండాలి, అన్ని కుటుంబాలను పోషించటానికి..నడపడానికి డబ్బు కావాలి. దీంతో తాలిబన్ కమాండర్లు ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తుండటంతో తాలిబన్ అగ్ర నాయకత్వం ఒక పెళ్లికంటే ఎక్కువ చేసుకోవద్దని ఆదేశించింది.

తాలిబన్ సీనియర్ లీడర్లలో అత్యధికులకు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలున్నారు. ఈ కొత్త ఆదేశాలు ఇప్పటికే ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలున్నవారికి వర్తించవు. కానీ ఇప్పటి నుంచి బహుభార్యాత్వం వద్దని ఆదేశించింది. ఇకనుంచి ఎవరూ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహమాడరాదని మిలిటెంట్ చీఫ్ ఆదేశాల సారాంశం.

బహుభార్యాత్వం ఆదేశాల సందర్భంగా ఆఫ్గానిస్థాన్ తాలిబన్ నేత ముల్లా హిబతుల్లా రెండు పేజీల డిక్రీని జారీ చేశారు. రెండు, మూడు, నాలుగో వివాహాలపై నిషేధం ఏమీ విధించలేదు. మరి ఇంకేంటీ..అనుకోవచ్చు..పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేయటం..తమను వ్యతిరేకించేవారికి అవకాశం ఇవ్వకూడదనీ..విమర్శలు రాకూడదనీ అటువంటి బహుభార్యాత్వనాకి దూరంగా ఉండాలని డిక్రీలో పేర్కొన్నారు. మిలిటెంట్ నాయకత్వమంతా బహుభార్యత్వానికి దూరంగా ఉంటే బలవంతపు వసూళ్లకు పాల్పడాల్సిన అవసరమే ఉండదని డిక్రీలో రాశారు.

దీంట్లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయ్..
మిలిటెంట్ కమాండర్లు కానీ..ఇతర నాయకులు గతంలో వారు పెళ్లి చేసుకున్న భార్యలకు పిల్లలు పుట్టకపోయినా..ఒకవేళ ఉన్నా..ఆడపిల్లలే పుట్టి మగ పిల్లలు లేకపోయినా సందర్భాలలో.. వితంతును వివాహమాడాలనుకుంటున్నవారికి.. నలుగురు భార్యలను పోషించగలిగే స్తోమత ఉన్నవారికి బహుభార్యాత్వం నుంచి మినహాయింపు ఇచ్చారు.

కానీ ఈ మినహాయింపులను పొందాలనుకుంటే మాత్రం వారి వారి పైస్థాయి నాయకుల నుంచి అనుమతి తీసుకున్నాకే రెండో పెళ్లి అయినా మూడో పెళ్లి అయినా చేసుకోవాలని ఆ డిక్రీలో సూచించారు. ఆప్గానిస్తాన్, పాకిస్తాన్‌లోని తాలిబన్ వర్గాలకు ఈ ఆదేశాలున్న లేఖను పంపిణీ మిలిటెంట్ నాయకులు చేస్తున్నారు.

కాగా ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లోని పష్తూన్ సమాజాలలో ఎప్పటి నుంచో బహుభార్యత్వం ఉంది. ఈ సమాజాల్లో ఆడవారికి పెళ్లి విషయంలో తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఉండదు. ఉన్నా అది అంతంత మాత్రమే. ఎవరిని పెళ్లాడాలి? ఏ వయసులో పెళ్లాడాలి? అది తమకు ఇష్టమా? కాదా? వంటి విషయాల్లోయువతులకు ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. కనీసం వారి అభిప్రాయం కూడా తెలుసుకోరు. వారి పెద్దలు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని చేసుకోవాల్సిందే.

మరో పెళ్లి చేసుకోవటానికి ఆరోపణలు
మరో పెళ్ళిచేసుకోవాలనుకునేవాళ్లు పలు రకాల ఆరోపణలు చేసి పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. భార్యలకు పిల్లలు పుట్టలేదనీ…పుట్టినా అందరూ ఆడపిల్లలే పుట్టారని.. మగపిల్లలు పుట్టలేదని మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అలా వారికి ఇష్టమైతే భర్త చనిపోయిన మహిళలను (వితంతువులు) భర్త సోదరుల్లో ఒకరు పెళ్లి చేసుకుంటారు. ఆ పద్ధతిని కుటుంబ గౌరవం కాపాడేందుకేనని చెబుతారు.

అలాకాకుండా బహుభార్యాత్వానికి మరో కారణం..వారి ఆర్థికస్తోమతను ప్రదర్శించుకోవటానికి కూడా చేస్తుంటారు. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటారు. అలా రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకున్నప్పుడు వధువు కుటుంబానికి కన్యాశుల్కం చెల్లిస్తారు. దాన్ని ‘వాల్వార్’ అంటారు.

తాలిబన్ల అగ్ర నేతలకు ఇద్దరు కంటే ఎక్కువమంది భార్యలు
తాలిబన్ల అగ్ర నేతల్లో చాలామందికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలే ఉన్నారు. తాలిబన్ ఉద్యమ వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ (లేటు) ఆయన తరువాత వచ్చిన ముల్లా అక్తర్ మన్సూర్ ఇద్దిరికీ ముగ్గురేసి భార్యలున్నారు. ప్రస్తుత తాలిబన్ చీఫ్ ముల్లా హిబతుల్లాకు కూడా ముగ్గురు భార్యలున్నారు. దోహాలో తాలిబన్ల సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బర్దార్‌కు కూడా ముగ్గురు భార్యలున్నారు. దోహా కేంద్రంగా పనిచేస్తున్న తాలిబన్ నాయకులందరికీ దాదాపు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలున్నారు.

అంతేకాదు.. తాలిబన్ నేతలు బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటారనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇది ఓపెన్ సీక్రెటే. అంతేకాదు.. పెళ్లి చేసుకునేటప్పుడు వధువుకి ఇవ్వాల్సిన (‘వాల్వార్’)డబ్బు విషయంలో కూడా వివాదాస్పదమవుతున్నాయి. కమాండర్లు..ఇంకా ఇతర నాయకులతో పాటు కొంతమంది ఫైటర్లు పెళ్లి చేసుకునేటప్పుడు లక్షలాది రూపాయలు ఇస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

ఈ డబ్బుని సంస్థ నిధి నుంచి కొంత..మరికొంత ప్రజల నుంచి బలవంతపు డబ్బు వసూలు చేసి చెల్లిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి పలు అంశాలు పైస్థాయికి చేరాయి. దీంతో మిలిటెంట్లపై ప్రజల్లో చెడ్డపేరు రాకుండా ఈ డిక్రీ జారీ చేసినట్లు తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి.