లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

నమీబియా ఎన్నికల్లో విజయం సాధించిన అడాల్ఫ్ హిట్లర్

Published

on

Namibia Elec

Africa : Namibia Adolf Hitler wins Elections : తాజాగా జరిగిన ఎన్నికల్లో అడాల్ఫ్ హిట్లర్ విజయం సాధించారు. అదేంటీ హిట్లర్ ఏంటీ ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించటమేంటీ..ఆయన ఏనాడో చనిపోయారు కదా అని ఆశ్చర్యంగా కలగొచ్చు. అసలు విషయం ఏమిటంటే..ఆఫ్రికా దేశమైన నమీబియాలో జరిగిన ఎన్నికల్లో అడాల్ఫ్ హిట్లర్ అనే పేరు కలిగిన వ్యక్తి పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో అతని పేరు వైరల్ గా మారింది. ఎక్కడో ఆఫ్రికాదేశంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన అడాల్ఫ్ హిట్లర్ యునానో అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అతని పేరే అతనికి ఆ క్రేజ్ తెచ్చిపెట్టింది.అడాల్ఫ్ హిట్లర్ అంటే ప్రపంచ వ్యాప్తంగా పేరొందని పేరు. పరియం అవసరం లేని పేరు. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్. 1889 ఏప్రిల్ 20న ఆస్ట్రియాలో జన్మించిన హిట్లర్ జర్మన్ నియంతగా ఎదిగారు. ప్రస్తుతం నమీబియా ఎన్నికల్లో అడాల్ఫ్ హిట్లర్ పేరుతో ఉన్న ఓవ్యక్తి విజయం సాధించటంతో హిట్లర్ పేరు మారోసారి తెరపైకి వచ్చింది.SWAPO పార్టీ ఆఫ్ నమీబియా టికెట్ మీద పరిగెత్తారు. అతను తన ప్రత్యర్థికి 1,196 తారాగణంతో పోలిస్తే 213 ఓట్లను ఆకర్షించాడు మరియు ఓషనా ప్రాంత పాలక మండలిలో ఒక స్థానాన్ని పొందాడు. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఓంపుండ్జా నియోజకవర్గంలో 5,000 కంటే తక్కువ మంది నివాసితులు ఉన్నారు మరియు చాలాకాలంగా ఇది SWAPO యొక్క బలమైన కోటగా పరిగణించబడుతుంది.నమీబియాలోని ఓంపుండ్జా నియోజకవర్గానికి అడాల్ఫ్ హిట్లర్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 85 శాతం ఓట్లు గెలుచుకున్న హిట్లర్ యునానో అధికార నైరుతి ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్ లో సభ్యుడు. ఈ పార్టీని SWAPO పార్టీ అని కూడా అంటారు.ఈ సందర్భంగా అడాల్ఫ్ హిట్లర్ యునానో మాట్లాడుతూ..నా తండ్రి నాకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలీదనీ తన పేరు గురించి తన చిన్నప్పుడు తనకు ఏమాత్రం తెలీదని…పెద్దయ్యాక ఆ పేరుకుండే ప్రత్యేక ఏంటో తెలుసుకున్నానని తెలిపారు. ఇప్పుడు తాను ఎన్నికల్లో గెలిచాక తన పేరుకు ప్రాధాన్యత సంతరించుకందని ఇది నాకు చాలా తమాషాగా అనిపిస్తోందని తెలిపాడు. నాకూ..నాజీ భావజాలంతో “ ఎటువంటి సంబంధం లేదు” అని నమీబియా హిట్లర్ నొక్కి చెప్పాడు.నమీబియా దక్షిణ ఆఫ్రికా పశ్చిమ భాగంలో ఉన్న దేశం. వర్ణవివక్ష దక్షిణాఫ్రికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా దశాబ్దాల సాయుధ పోరాటం తరువాత 1990 లో ఇది పూర్తి స్వాతంత్ర్యాన్ని పొందింది. స్వాపో స్వాతంత్ర్య అనుకూల ఉద్యమంగా ఉద్భవించింది మరియు దేశం పూర్తిగా సార్వభౌమత్వం పొందినప్పటి నుండి ఒక ప్రముఖ రాజకీయ శక్తిగా ఎదిగింది.కాగా అడాల్ఫ్ హిట్లర్ పరిచయం అవసరంలేని పేరు. జర్మన్ నియంత. జర్మన్సే ప్రపంచాన్ని ఏలేందుకు అర్హులని భావించిన హిట్లర్‌ మారణహోమానికి నాంది పలికాడు నియంత అడాల్ఫ్ హిట్లర్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *