లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా

Published

on

afridi tested corona positive

పాకిస్తాన్ లో కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోంది. ఆ దేశంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పేద, ధనిక అనే తేడా లేదు. అందరిని కరోనా కాటేస్తోంది. ఇప్పటికే పాక్ కి చెందిన పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్, కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి సైతం కరోనా సోకింది. తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా అఫ్రిది ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయం తెలిశాక అభిమానులు ఆవేదన చెందారు. అఫ్రిది త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్లు చేశారు.

పాక్ లో కరోనా బారిన పడ్డ మూడో క్రికెటర్:
అఫ్రిది రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనుమానంతో శనివారం(జూన్ 13,2020) కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో అఫ్రిదికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అఫ్రిది స్వయంగా వెల్లడించాడు. పాకిస్తాన్ లో కరోనా వైరస్ బారిన పడ్డ మూడో క్రికెటర్ అఫ్రిది. ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లు తౌఫీర్‌ ఉమర్‌, జఫర్‌ సర్ఫరాజ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాక్‌ క్రికెట్‌లో కరోనా కలకలం రేపుతోంది. ముందస్తు జాగ్రత్తగా మరికొంతమంది ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు లక్షా 32 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 2వేల 600కి చేరింది. 

విధ్వంసక ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు:
1996లో పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షాహిద్ అఫ్రిది.. 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచ్‌లాడాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో పాక్ జట్టుని కెప్టెన్‌గా నడిపించిన అఫ్రిది.. విధ్వంసక ఇన్నింగ్స్‌లకి పెట్టింది పేరు. వన్డేల్లో అత్యంత చిన్న వయసులోనే సెంచరీ నమోదు చేసిన రికార్డ్ అఫ్రిది పేరిటే ఉంది. 16 ఏళ్ల వయసులో.. అదీ అంతర్జాతీయ క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన రెండో మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ని అఫ్రిది సాధించాడు. 1996లో శ్రీలంకతో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు.

ప్రధాని మోడీపై అఫ్రిది విమర్శలు:
కరోనా వైరస్‌ కారణంగా పాక్ లో లాక్‌డౌన్ విధించగా.. చాలామంది పేదలకి అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా ఆహారం, నిత్యావసరాల్ని అందించాడు. ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సైతం పర్యటించిన అఫ్రిది.. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు. ‘‘ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతోంది. కానీ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మనసులో కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్నాయి. పాక్ సైన్యం ఏడు లక్షలుకాగా.. ఒక్క కాశ్మీర్‌లోనే భారత ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మంది సైన్యాన్ని మొహరించింది. కానీ.. కాశ్మీర్ పౌరులు పాక్‌ సైన్యానికే సపోర్ట్ చేస్తున్నారు’’ అని విద్వేష వ్యాఖ్యలు చేశాడు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *