After five days of tree quarantine, Bengal youths moved to ICDS centre

చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్‌ లో ఉన్న బెంగాల్ యువకులు ICDS కేంద్రానికి తరలింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్‌ లో ఉన్న బెంగాల్ యువకులను ఐసోలేషన్ కోసం ICDS కేంద్రానికి తరలించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు.

పశ్చిమ బెంగాల్ పురులియా జిల్లాకు చెందిన ఏడుగురు యువకులు మామిడి చెట్టుపై ఐదు రోజులపాటు క్వారంటైన్ లో ఉన్న అనంతరం అధికారులు వారిని ఐసోలేషన్ కోసం ఐసిడిఎస్ కేంద్రానికి తరలించారు. భంగ్డి గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు చెన్నైలో పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు. వెంటనే డాక్టర్లు వారిని 7రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఇళ్లళ్లో విడి గదులు లేకపోవడంతో గ్రామానికి దగ్గర్లోని మామిడి చెట్టే వారికి ఐసోలేషన్ గా మారింది. ఏడుగురు యువకులు మామిడి చెట్టు కొమ్మలపై నివసిస్తున్నారు.

గ్రామస్తులు వారి కోసం చెట్టు కొమ్మలకు మంచాలు కట్టారు. దోమతెరలు, ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. ఐసోలేషన్ కోసం ఇళ్లళ్లో విడి గదులు లేకపోవడంతో చెట్టుపైనే ఉండాలని, గ్రామంలోకి ప్రవేశించవద్దని గ్రామస్తులు యువకులను కోరారు.

గత రాత్రి అధికారులు చెట్టు మీద ఉన్న తమను చూసి, దగ్గరకు వచ్చి మాట్లాడాలి అన్ని వివరాలు సేకరించారని ఏడుగురు యువకులలో ఒకరైన బిజోయ్ సింగ్ లయా అన్నారు. గ్రామస్తులు తమను గ్రామంలోకి రావొద్దన్నందుకు అధికారులు తమను కోసం గది వెతికారని తెలిపారు. అనంతరం అధికారులు సమీపంలోని ఐసిడిఎస్‌ కేంద్రంలో తమకు ఏర్పాట్లు, అక్కడికి తరలించారని తెలిపారు. ఈ గదిలో టాయిలెట్, సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ పడకలను కూడా ఏర్పాటు చేశారని, తాము ఇప్పుడు బాగానే ఉన్నామని చెప్పారు. 

గ్రామం నుండి తమకు సరైన ఆహారం అందిస్తున్నారని తెలిపారు. ఇతరుల నుండి పరిశుభ్రత పాటిస్తున్నామని, ఇతరుల నుంచి దూరాన్ని పాటిస్తున్నామని లయా చెప్పారు. అయితే మంచాలు లేకపోవడంతో వారు నేలపై పడుకుంటున్నారు.

వార్త తెలియగానే, అధికారులు గదిని గుర్తించారు, ఇప్పుడు యువకులను అక్కడ ఉంచారని బలరాంపూర్ పంచాయతీ సమితి అధ్యక్షుడు నితాయ్ మొండోల్ అన్నారు. వారు ఐసోలేషన్ లో ఉన్నారని, వాటిలో ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలోని ఇళ్లు చిన్నవి కాబట్టి, ఐసోలేషన్ సాధ్యం కానందున తాము వారిని గ్రామలోకి అనుమతించలేమని ఒక గ్రామస్తుడు చెప్పాడు. యువకులను ఐసిడిఎస్ కేంద్రంలో ఉంచితే ఫర్వాలేదని అన్నారు. 

READ  రైల్వేలో ఉద్యోగాలు : ఆ కులం వారు మాత్రమే అర్హులు

బాలపరంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భంగ్డి గ్రామంలో వలస కార్మికులుగా ఉన్న ఈ ఏడుగురు యువకులను గ్రామస్తులు నిర్బంధించారు. ఇటీవలే యువకులు చెన్నై నుండి తిరిగి వచ్చారు. ఈ యువకులను గృహ నిర్బంధంలో ఉండాలని వైద్యులు చెప్పడంతో 8 అడుగుల నుండి 10 అడుగుల ఎత్తులో ఉన్న చెట్ల కొమ్మలపై గ్రామస్తులు వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read | జాగ్రత్త : హోం క్వారంటైన్ నుంచి తప్పించుకున్న పాతబస్తీ యువకుడు

Related Posts