లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వ్యాక్సినేషన్ తర్వాత ఎయిమ్స్ వర్కర్‌కు అలర్జిక్ రియాక్షన్‌, 51మందికి అస్వస్థత

Published

on

vaccination-starts

Vaccination: దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన వ్యాక్సిసేషన్ ప్రక్రియలో అంతా సాఫీగా జరిగిన అక్కడక్కడ కొద్దిపాటి సమస్యలు కనిపించాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో ఓ సెక్యూరిటీ గార్డుకు కొవాక్సిన్ ఇవ్వడంతో అలర్జిక్ రియాక్షన్ వచ్చిందని అధికారులు అంటున్నారు.

ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ఓ సెక్యూరిటీ గార్డు సాయంత్రం 4గంటల తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నాడు. 15-20 నిమిషాల తర్వాత అలర్జిక్ సమస్య వచ్చి చర్మంపై పొక్కులు వచ్చాయి. ‘వెంటనే అతనికి ట్రీట్ మెంట్ ఇప్పించి బాగు చేశాం. ప్రస్తుతం అతను సేఫ్ గా ఉన్నాడు. ముందస్తు జాగ్రత్తగా అతని కండిషన్ ను మానిటర్ చేసేందుకు అడ్మిట్ చేసుకున్నాం. ఆదివారం ఉదయం అతణ్ని డిశ్చార్జి చేస్తాం’ అని గులేరియా అన్నారు.

ఢిల్లీలో జరిగిన మొత్తం వ్యాక్సినేషన్ పక్రియలో 51మైనర్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలోని హెల్త్ కేర్ వర్కర్లలో కొద్ది మందిలో సమస్యలు కనిపించాయి. మొత్తం 8వేల 117హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చాం. 11జిల్లాల్లో 4వేల 319మందికి వ్యాక్సినేషన్ పక్రియలో పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 81సెంటర్లలో ప్రక్రియ జరిగింది. ప్రతి సెంటర్ లో దాదాపు 100మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు టార్గెట్ చేశారు.