Home » మధ్యాహ్నం కునుకు తీయండి.. మెంటల్ ఎజిలిటీ బూస్టింగ్ చేసుకోండి.
Published
4 weeks agoon
Afternoon Nap: మధ్యాహ్నం పడుకోవడం అనేది చాలా చెడ్డ అలవాటు అని ఫీల్ అవుతుంటారు. కొంత మంది ఇదేదో జబ్బు, శక్తి లేకపోవడం, బద్ధకం అని పొరబాడుతుంటారు. కొత్త స్టడీ ప్రకారం.. 60ఏళ్లు పైబడిన వారు మానసికంగా షార్ప్ గా ఉంటారని చెప్తుంది. మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండే వారి కంటే నిద్రపోయిన వారు మరింత ప్రశాంతంగా ఉంటారని రీసెర్చర్లు చెబుతున్నారు.
జనరల్ సైకియాట్రి జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. ఫిజికల్ గా, మానసిక ఆరోగ్యం రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 60ఏళ్ల కంటే పైబడ్డవారు 2వేల 214మందిపై స్టడీ నిర్వహించారు. వీరిలో వెయ్యి 534మంది రెగ్యూలర్ గా నిద్రపోతుండగా.. 680 మంది అప్పుడప్పుడు మాత్రమే.
నేర్చుకోవడానికి నిద్ర చాలా కీలకంగా పనిచేస్తుందని వెల్ బీయింగ్ డైరక్టర్ డవీనా రామ్ కిస్సన్ అంటున్నారు. అలా కునుకు తీసే వారి బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ నుంచి రికవరీ అవుతుంది. అలా నిద్రపోయి లేస్తే అవసరం లేని డేటా మొత్తాన్ని బ్రెయిన్ క్లియర్ చేసుకుంటుంది. లేదంటే టెంపరరీ స్టోరేజ్ ఏరియాల్లో కొత్త ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే గ్యాప్ ఉండదు.
లంచ్ తర్వాత 5నిమిషాల నుంచి 2గంటల మధ్య కాలంలో పడుకోవడం అనేది ఉత్తమం. అది కూడా 1గంట నుంచి 3గంటల మధ్యలో 10 నుంచి 30నిమిషాలు నిద్రపోవాలని స్లీప్ కోచ్ క్యాథరిన్ అంటున్నారు. ఇది థెరఫీలో ప్రక్రియ. అలా చేయడం వల్ల మూడ్ ఇంప్రూవ్ అవడం, ఎనర్జీ క్రియేట్ అవడం, ప్రొడక్టివిటీ పెరగడంతో పాటు యాంగ్జైటీ, ఫిజికల్, మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి.
అదే 60నిమిషాల పాటునిద్రపోతే నేర్చుకోవడానికి మైండ్ ను రెడీ చేసినట్లు అవుతుంది. అప్పుడు బ్రెయిన్ టెంపరరీ హోల్డింగ్ నుంచి మెమొరీస్ గా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పసుపు పాలు తాగండి..రోగాల నుంచి దూరంగా ఉండండి
వీగన్ డైట్ తీసుకొంటే… శృంగార సామర్ధ్యం పెరిగి, పడకగదిలో నాలుగింతలు చెలరేగిపోతారంట
రోగ నిరోధక శక్తి కోసం : Pineapple, Lemon Free
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? : వైఫై స్పీడ్ పెంచుకోండి ఇలా!
కిక్కు దిగింది.. చోరీకెళ్లిన ఇంట్లో నిద్రపోయిన దొంగ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
దేశ పౌరులకు ఒక్కొక్కరికి రూ.90వేలు ఇస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా..