ఈ నగరానికి ఏమైంది, హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

heavy rain in hyderabad: హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. రెండు రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. శనివారం(అక్టోబర్ 17,2020) సాయంత్రం 5 గంటలకు సడెన్ గా వాతావరణం మారిపోయింది. కుండపోత వాన నగరాన్ని ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుతోంది. సడెన్ గా వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి.


మొన్న కురిసిన కుండపోత వానకు హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికింది. నగరంలోని పలు కాలనీలో ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. తాగడానికి నీళ్లు కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద కష్టాల నుంచి బయటపడక ముందే మరోసారి భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Posts