లావు తగ్గిస్తానని… కూతురు వయసున్న మహిళతో పరారీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ మధ్యకాలంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రధ్ద ఎక్కువై పోయింది. వరి అన్నం తినటం మానేసి తృణధాన్యాలు, ఆర్గానిక్ ఫుడ్స్ , వెజిటబుల్స్ తినటం మొదలెట్టారు అలాంటి వాటిలో లోనే బరువు తగ్గటం…లావు తగ్గటం వంటి వాటి కోసం వివిధ యోగా సెంటర్లను జిమ్ లను సంప్రదిస్తున్నారు.

విశాఖపట్నానికి చెందిన ఒక పెద్దమనిషి (56) హైదరాబాద్ ఎల్ బీ నగర్ లో ఉఁడే ఒక వివాహిత మహిళ(36) ను లావు తగ్గిస్తానని చెప్పి ఆమెతో కలిసి ఉడాయించాడు.  విశాఖపట్నం  శ్రీహరి పురంలో నివసించే బెహరా(56) అనే వ్యక్తి భార్యా కుమారుడితో నివాసం ఉంటున్నాడు. అతనికి హైదరాబాద్ ఎల్ బీ నగర్ లో ఉండే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఈ క్రమంలో ఎల్బీ నగర్ లో నివసించే వ్యక్తి భార్యతో బెహరా పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో చనువుగా మాట్లాడుతూ మరింత దగ్గరయ్యాడు.వివాహిత మహిళ లావుగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను లావు తగ్గిస్తానని చెప్పి ఆమెకు ఆశ కల్పించాడు. దీంతో ఆమె అతడికి మరింత దగ్గరయ్యింది. గత వారం ఆమెను విశాఖపట్నం తీసుకు వచ్చాడు. అయితే భార్య కనపడకపోయే సరికి ఆమె భర్త ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

మరదలితో అక్రమ సంబంధం, కాళ్లు చేతులు కట్టేసి నడిరోడ్డుపై దారుణ హత్య


విశాఖ జిల్లా శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన బెహరా అనే వ్యక్తిపై అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. అందులో భాగంగా ఎల్బీనగర్ పోలీసులు సివిల్‌ డ్రెస్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీహరిపురం వచ్చి బెహరా వద్ద విచారించారు. ఈ క్రమంలో అక్కడ స్థానికులు బెహరాతో వచ్చిన మహిళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారనుకొని 100కు డయల్‌ చేశారు.దీంతో అక్కడికి మల్కాపురం పోలీసులు వచ్చారు. సివిల్‌ డ్రస్‌లో ఉన్న ఎల్‌బీ నగర్‌ పోలీసులను ప్రశ్నించారు. తాము కూడా పోలీసులమని చెప్పి ఐడీ కార్డులు చూపించారు. పోలీసులు, పోలీసులు పరిచయ కార్యక్రమం జరుగుతుండగా…… ఎల్బీ నగర్ వివాహిత మహిళతో పాటు బెహరా అక్కడి నుంచి తప్పించుకు పారిపోయాడు. వారి కోసం ఎల్‌బీ నగర్, మల్కాపురం పోలీసులు గాలిస్తున్నారు.

Related Posts