కరోనా కష్టాల్లో ఆగ్రా ‘రోటీ వాలీ అమ్మ’ దీనికి తోడు రొట్టెలు అమ్మొద్దంటూ బెదిరింపులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Agra’s ‘roti wali amma’ shares plight of no sale : ఇటీవలే ఆగ్రాకే చెందిన ఓ వృద్ధజంట నడుపుతున్న ‘‘బాబాకా దాబా’’ పేరుతో ఓచిన్నబండిని, కరోనా కారణంగా వారు ఎదుర్కొన్న కష్టాలను ఓ నెటిజన్ చూసి వారి కష్టాల్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా..ఆ వృద్ధజంటకు సాయం చేయడానికి ఆగ్రావాసులు మొత్తం కదిలివచ్చారు. తెల్లారేసరికి ఆ వృద్ధజంట నడుపుతున్న బండి కాస్తా హోటల్‌గా మారిపోయింది. వారి జీవితం తిరిగి గాడిలో పడింది. వారి వ్యాపారం కోలకుంది.


ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రాకు చెందిన ”రోటీ వాలీ అమ్మ” కష్టం కూడా వైరల్ గా మారింది. ఆగ్రాలో ”రోటీ వాలీ అమ్మ” అంటే తెలియనివారుండరు. ఆగ్రాలోనే కాదు ఆ చుట్టు పక్కలవారికి రోటీవాలీ అమ్మ అంటే సాక్షాత్తూ అన్నపూర్ణే. 20-30 ఏళ్లుగా రోడ్డుపై చిన్న షాపులో రొట్టెలు అమ్ముకుంటోందా ”రోటీ వాలీ అమ్మ”గా పేరొందిన భగవాన్ దేవి అనే వృద్ధురాలు.కేవలం రూ.20కే నాలుగు రొట్టెలు రెండు కూరలు అమ్ముతోంది….


ఆమె రూ.20రోటీలతో పేదలు కడుపునింపుకునేవారు.రిక్షావాలాలు, రోజువారీ కూలీలు ఆమె దగ్గరే తినేవారు. కానీ కరోనాతో ఈ పరిస్థితి మారిపోయింది. అసలు కూలీలకు, రిక్షావాలాలకే పని దొరకడం కష్టమైంది. దీంతో రోటీవాలీ అమ్మ కష్టాలు పెరిగాయి.


ఈ కరోనా కాలంలో బేరాలు లేకపోయినా ఆ కష్టాన్ని నెట్టుకొస్తోందామె. కానీ దీనికి తోడో మరో కష్టంతో ఏం చేయాలో తెలీక పాపం ఆ వృద్ధురాలు తల్లడిల్లిపోతోంది. ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగుండు అనే ఆశతో ఎదురుచూస్తోంది.


రోటీవాలీ అమ్మ రొట్టెలు అమ్మే ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కొందరు ఆమెను బెదిరించారు. వెంటనే ఖాళీ చేయాలని లేకుంటే అన్నీ బైటవిసిరేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారట. ఆ ప్రాంతంలో ఇలా రొట్టులు అమ్మొద్దని..వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని బెదిరించారట.


దీంతో ఎప్పుడు ఎవరొచ్చి తన దుకాణం మూయించేస్తారా? అని ఈ బామ్మ భయపడిపోతోంది. తనకు ఇద్దరు కొడుకులున్నా..ఎవరూ చూడటం లేదని..ఇలా తానే కష్టపడి బతుకు బండి నడుపుకొస్తున్నాననీ కానీ ఇప్పుడు తనకు ఈ ఉపాధి కూడా పోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తంచేస్తోందామె.


ఆటోలో ‘అమ్మ రుచి’ : తినకుండా ఉండలేరు..తింటే వదల్లేరు..


ఇలాంటి సమయంలో ఉన్న ఒక్క ఆధారం కూడా పోతే తాను ఎలా బతకాలని ఆవేదన చెందుతోంది. తనకు ఓ చిన్న షాపు ఉంటే నిశ్చింతగా ఉంటుందని అంటోంది. మరి ఈమెను కూడా ఆగ్రావాసులు ఆదుకుంటారేమో చూడాలి.

Related Tags :

Related Posts :