Peanut : అనంత రైతులకు వరం… కదిరి వేరుశనగ రకం

కదిరి రకం విత్తనాలు సాగు చేసేందుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రకం వేరు శెనగ మొక్కకు దాదాపు 100 నుండి 150 కాయలు కాస్తాయి. దీంతో ఎకరాకు 45క్వింటాల్ నుండి 50క్వింటాల్ వ

Peanut : అనంత రైతులకు వరం… కదిరి వేరుశనగ రకం

Kadiri1812 (2)

Peanut : పెట్టుబడులు పెరగటం..ఫలసాయం తక్కువగానే ఉండటం, చీడపీడల బెడద వెరసి రైతులు సేధ్యపురంగాన్ని అనాసక్తితోనే నెట్టుకొస్తున్నారు. ఈక్రమంలో వ్యవసాయం శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణలు రైతాంగం కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అందుబాటులోకి వస్తున్న కొత్త వంగడాలతో సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు.

ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటను ఎక్కువగా సాగుచేస్తుంటారు. వాతావరణ పరిస్ధితులు,నేలస్వభావం నేపధ్యంలో ఆప్రాంతం వేరుశనగ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈక్రమంలోనే కదిరి వ్యసాయ పరిశోధన స్ధానం రూపొందించిన కొత్తరకం వేరుశనగ విత్తనం అనంతపురం జిల్లా రైతులపాలిట వరంగా మారింది. కదిరి1812 రకం వేరుశనగ వంగడాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు.

కదిరి రకం విత్తనాలు సాగు చేసేందుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రకం వేరు శెనగ మొక్కకు దాదాపు 100 నుండి 150 కాయలు కాస్తాయి. దీంతో ఎకరాకు 45క్వింటాల్ నుండి 50క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో కదిరి విత్తనం ధర క్వింటాకు 2,200 రూపాయలు పలుకుతుంది. ఎకరా వేరుశెనగ సాగుకు రైతుకు 15వేల వరకు ఖర్చవుతుండగా, లక్ష రూపాయల వరకు అదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోను 50వేల వరకు ఎకరాకు రైతుకు మిగులుతుంది.

కదిరి రకం వేరుశనగ చీడపీడల ఉధృతిని తట్టుకొని మంచి దిగుబడి ఇస్తున్నట్లు రైతాంగం చెప్తోంది. పంటకాలం మొత్తంలో ఒక్కసారి పురుగు మందులు పిచికారి చేస్తే పరిపోతుందంటున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రైతులు కదిరి 1812 రకం వేరుశనగ విత్తనాన్ని సాగు చేస్తున్నారు. చీడపీడలు తట్టుకుని నిలబడే రకం కావటం, దిగుబడి అధికంగా ఉండటం, వాతావరణ పరిస్ధితులను తట్టుకోవటంతో రైతులు కదిరి రకం వేరుశనగ సాగుతో మేలు చేకూరుతున్నట్లు చెబుతున్నారు.