Ajwain Farming : రైతులకు లాభదాయకంగా వాము సాగు!

విత్తనం విత్తటానికి ముందు నేలను మెత్తగా పదును చేయాలి. ఇందుకోసం 2 సార్లు దుక్కి దున్నుకోవాలి. ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు వేయాలి. పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువులు పెంచి కలియదున్నుకోవాలి.

Ajwain Farming : రైతులకు లాభదాయకంగా వాము సాగు!

Ajwain farming is profitable for farmers!

Ajwain Farming : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా వాము సాగువైపు మొగ్గు చూపుతున్నారు. చల్లని , మంచు వాతావరణం ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది. వర్షధారం క్రింద సాగు చేయాలనుకుంటే నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు కూడా అనుకూలమే. అధిక ఆమ్ల, క్షార నేలలు , నీరు నిలువ ఉండే నేలలు అనుకూలం కాదు. ఆగస్టు నుండి సెప్పెంటరు మొదటి వారం వరక విత్తుకోవచ్చు. నీటి పారుదల ఉంటే సెప్టెంబర్ వరకు విత్తుకోవచ్చు.

విత్తన రకాలు ; లాం సెలక్షన్ 1 ఇది 160 రోజుల్లో పంటకు వస్తుంది. నూనె శాతం 3శాతం ఉంటుంది. ఎకరాకు 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. లాం అజోవాన్ 2 ఇది 160 రోజుల్లో కోతకు వస్తుంది. నూనె శాతం 4 ఉంటుంది. అధిక దిగుబడినిచ్చే వంగడం. ఎకరానికి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

విత్తనం విత్తటానికి ముందు నేలను మెత్తగా పదును చేయాలి. ఇందుకోసం 2 సార్లు దుక్కి దున్నుకోవాలి. ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు వేయాలి. పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువులు పెంచి కలియదున్నుకోవాలి. ఎకరాకు కిలో విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 1గ్రా కార్బండిజమ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని 1;5 నిష్పత్తిలో ఇసుకతో కలిపి గొర్రుతో 4 సెంమీ లోతులో ఎద పెట్టుకోవాలి. సాలుకు సాలుకు మధ్య 56 సెం.మీ ఎడం ఉండేటట్లు చూసుకోవాలి.

మొలక రావటానికి రెండు వారాలు పడుతుంది. అవసరాన్ని బట్టి తేలికపాటి తడిని ఇవ్వాలి. మొలక సరిగా వచ్చే టట్లు ఈ తడి దోహదపడుతుంది. మొక్కలు మొలిచిన తరువాత రెండు మూడు ఆకుల దశలో చాళ్లలో మొక్కల మధ్య 20 సెంమీ ఉండేటట్లుగా ఎడం చేయాలి.

ఇక ఎరువుల విషయానికి వస్తే ఆకరి దుక్కిలో 15 కిలోల యూరియా, 100కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నీటి వసతి ఉంటే విత్తిన 40 రోజులకు 15 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పై పాటుగా వేసుకోవాలి. విత్తిన తరువాత మొదటి 100 రోజుల్లో 3 సార్లు కలుపు తీసి, గొర్రుతో అంతర కృషి చేసి గుంటక తోలాలి. నీటి పారుదల కింద 20 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి.

పంట 160 రోజుల్లోపు కోతకు వస్తుంది. గింజలు గోధుమ రంగులోకి వచ్చిన తరువాత పక్వదశకు చేరినట్లు భావించి గింజలు రాలకుండా మొక్కలు కోసి నూర్పిడి చేసుకోవాలి.