Soil Test : పొలానికి రక్ష.. భూసార పరీక్ష

పొలంలోని పోషక పదార్ధాల స్ధాయిని తెలుసుకోవచ్చు. భూమి యొక్క భౌతిక , రసాయన స్ధితిని బట్టి ఏపంటలు పండించటానికి అనువుగా ఉంటుందో అర్ధమౌతుంది.

Soil Test : పొలానికి రక్ష.. భూసార పరీక్ష

Soil Test

Soil Test : రైతులు తమకు ఉన్న కొద్ది పాటి పొలంలో రకరకాల పంటలు పండిస్తుంటారు. సాగు చేసే పంటల్లో అధిక దిగుబడి పొందటంలో నేల స్వభావం, భూసారం కీలకంగా ఉంటుంది. అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గిపోతుంది. దీంతో దిగుబడి కూడా తగ్గుతుంది. దీనికి తోడు పెట్టుబడి అధికమవుతుంది. భూసార పరీక్షల ద్వారా పంటల దిగుబడి ఎంతవస్తుందనేది కూడా ముందుగానే ఒక అంచనాకు రావచ్చు.

భూసార పరీక్షలో పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలను వివిధ భౌతిక , రసాయన పరీక్షల ద్వారా పోషక పదార్ధాల పరిమాణాన్ని లెక్కగడతారు. భూమిలో ఉన్న పోషకాల అధారంగా ఏ పంట వేయాలి, ఎంత మోతాదులో ఎదరువులు వేయాలో పరీక్షల ద్వారా రైతులు ఒక అంచనాకు రావచ్చు.

భూసార పరీక్షల వల్ల ప్రయోజనాలు ;

పొలంలోని పోషక పదార్ధాల స్ధాయిని తెలుసుకోవచ్చు. భూమి యొక్క భౌతిక , రసాయన స్ధితిని బట్టి ఏపంటలు పండించటానికి అనువుగా ఉంటుందో అర్ధమౌతుంది. మట్టి పరీక్ష ఫలితాలను బట్టి ఏపంటకు ఏయే మోతాదులో ఎరువులు వేయాలో వాటిని ఎప్పుడు వాడాలో తెలుస్తుంది. పంటపొలాల్లో చౌడు, ఆమ్ల స్ధాయిని నిర్ధారించి సరిచేసేందుకు సరైన పద్దతులు సిఫారుసు చేయవచ్చు.

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకునే వీలుంటుంది. భూములలో ఉన్న ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి వాటితో పాటు అధిక దిగుబడికి వేయవలసిన ఎరువుల మోతాదు తెలుసుకోవచ్చు. భూసార పరీక్షల అధారంగా పంట భూములు నిస్సారమై చెడిపోకుండా పశువుల పెంట, కంపోస్టు, పచ్చిరొట్ట వంటి సేంద్రీయ ఎరువులు, రసాయనిక ఎరువులతో పాటు సమగ్రంగా, సమతుల్యంగా ఏమోతాదులో వాడుకోవాలో అవగాహనకు రావచ్చు.