Azolla Cultivation : పశువుల దాణాగా…అజోల్లా సాగు

అజొల్లవిత్తన ముడి సరుకును, కిందపరచుకుని ఉన్న అజొల్ల పాదు పైనున్న మట్టిని, నీటిని సున్నితంగా కదిలించిన తర్వాత చల్లాలి.

Azolla Cultivation : పశువుల దాణాగా…అజోల్లా సాగు

Azolla

Azolla Cultivation : అజొల్ల..ఇదొకరకమైన నాచుమొక్క…నీటిపై తేలియాడుతూ ఉండే ఈ కలుపుమొక్క వరి పొలాల్లోనూ,లోతులేని జలావాసాల్లోనూ పెరుగుతుంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. అధికమాంసకృత్తులుండి, కాండభాగం తక్కువగా ఉండటంతో పశువులు త్వరగా జీర్ణం చేసుకోగలవు. కోళ్ళకు మంచి దాణాగా ఉపయోగపడుతుంది. అజొల్లను ఇతరదాణాలతో కలిపికానీ, నేరుగా కానీ ఇవ్వవచ్చు. కుందేళ్ళకు,పందులకు,గొర్రెలకు,మేకలకు,కోళ్ళకు అజోలా మంచి దాణాగా ఉపకరిస్తుంది.

అజోల్లా సాగు విధానం; అజోల్లా సాగుకు ముందుగా నేలను సదరం చేసుకోవాలి. కలుపుమొక్కలను ఏరివేయాలి. ఇటుకలను దీర్ఘచతురస్రాకారంలో అమర్చాలి. పోలిధిన్ షీటును దీర్ఘచతురస్రాకారంలో అమర్చిన ఇటుకల చివరలు కూడా కప్పెట్టబడేలా వాటిమీద సమాంతరంగా పరవాలి. జల్లించిన 10-15 కిలో గ్రాముల మట్టిని ఈ షీటు పై చల్లాలి. ఆవుపేడ 2 కిలోగ్రాములు, 30 గ్రాముల సూపర్ ఫాస్పేట్ కలిపిన ముద్దను 10 లీటర్ల నీటితో కలిపి పోలిధిన్ షీటు మీద పోయాలి. నీటిమట్టం 10 సెంటి మీటర్లకు చేరేందుకు మరిన్ని నీళ్ళను పోయాలి.

అజొల్లవిత్తన ముడి సరుకును, కిందపరచుకుని ఉన్న అజొల్ల పాదు పైనున్న మట్టిని, నీటిని సున్నితంగా కదిలించిన తర్వాత చల్లాలి. అజొల్ల మొక్కలు నిటారుగా ఎదిగేందుకు అవి భూమిని చీల్చుకుని బయటకు వచ్చిన వెంటనే తాజానీటిని చిలకరించాలి. వారంరోజుల వ్యవధిలోనే అజొల్ల పాదుమొత్తం పరచుకుని పచ్చని వర్ణంలో కనిపిస్తుంది. అజోల్లా బాగా పెరిగేందుకు సూపర్ సల్ఫేట్ , అవుపేడ కలిపిన మిశ్రమాన్ని అయిదురోజుల కొకసారి కలుపుతుండాలి.

వారానికి ఒకసారి మెగ్నీషియం, ఇనుము, రాగి, సల్ఫ్రర్ వంటివి కలిపినసూక్ష్మపోషకమిశ్రమాన్నికలుపుకోవటం మంచిది. నెలరోజులకొకసారి నత్రజని పెరిగకుండా అయిదు కిలోల పాదు మట్టిని మార్చటం మంచిది. దీనివల్ల సూక్ష్మపోషక లోపాన్నినివారించవచ్చు. ప్రతి ఆరునెలల కొకసారి పాదును శుభ్రం చేసి, నీటిని, మట్టిని మార్చి, కొత్తగా అజొల్ల విత్తనాలను చల్లుకోవాలి.