Lemon Tree Cultivation : రైతులకు అందుబాటులో మేలైన నిమ్మరకాలు.. అధిక దిగుబడులకోసం తోటల్లో చేయాల్సిన యాజామాన్యం

నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, కాపు వుంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. పూత వచ్చిన నాలుగు నెలలకు కాయ పక్వానికి వస్తుంది. ప్రస్థుతం వచ్చే పూత నుండి అధిక దిగుబడి సాధించాలంటే నీటి యాజమాన్యం, పోషకాల విషయంలో రైతులు తగిన శ్రద్ధ పెట్టాలి.

Lemon Tree Cultivation : రైతులకు అందుబాటులో మేలైన నిమ్మరకాలు.. అధిక దిగుబడులకోసం తోటల్లో చేయాల్సిన యాజామాన్యం

Lemon farming

Lemon Tree Cultivation : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్లతోటల్లో నిమ్మ ఒకటి. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు అందుబాటులో వుండటం, వన్యప్రాణుల బెడద లేకపోవటంతో  తక్కువ రిస్కుతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నిమ్మతోటల్లో సంవత్సరం పొడవునా పూత, పిందె వున్నప్పటికీ, వేసవిలో వచ్చే కాపుకు అధిక డిమాండ్ వుండటంతో రైతులు, జనవరి నుండి వచ్చే పూతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.  నిమ్మ తోటల్లో అధిక దిగుబడి సాధించేందుకు అనువైన మేలైన రకాలు, పూత దశలో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Lime Cultivation : ఎలాంటి నేలలు నిమ్మసాగుకు అనుకూలమో తెలుసా!..

ఆంధ్రప్రదేశ్ లో అధిక విస్తర్ణంలో సాగయ్యే పండ్ల తోటల్లో నిమ్మ ఒకటి. సుమారు 2 లక్షల 90 వేల ఎకరాల్లో నిమ్మ సాగవుతుండగా, గుంటూరు జిల్లా తెనాలి, నెల్లూరు జిల్లా గూడూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాలు నిమ్మ సాగుకు పేరుగాంచాయి. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 95 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ తోటలు సాగులో వున్నాయి. ఒకసారి నాటితే 20 నుండి 25 సంవత్సరాల వరకు తోటల నుండి దిగుబడి రావటం, శివారు ప్రాంతాల్లో సైతం, వన్య మృగాల బెడద లేకపోవటంతో నిమ్మ సాగు రైతుకు అన్ని విధాలా లాభదాయకంగా వుంది. సాధారణంగా రైతులు గతంలో ఎకరాకు 80 మొక్కలు వచ్చే విధంగా నిమ్మ నాటేవారు.

ప్రస్థుతం ఎకరాకు 6 నుండి 7 గజాల దూరంతో 100 నుండి 140 మొక్కలు వచ్చే విధంగా నాటుతున్నారు. నాటిన 3వ సంవత్సరం నుండి కాపు ప్రారంభమయ్యే ఈ తోటల్లో ప్రాంతాన్నిబట్టి,  రైతులు సగటున ఎకరాకు 60 నుండి 100 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తున్నారు.  మార్కెట్ హెచ్చుతగ్గులు అధికంగా వున్నా…. ఏదో ఒక సీజన్ లో మంచి మార్కెట్ ధర లభించటం, వేసవిలో స్థిరమైన రాబడినిస్తుండటంతో లాభాలకు కొదవ లేని పంటగా నిమ్మ సాగు పేరుగాంచింది.

READ ALSO : Lemon Farming : నిమ్మతోటల్లో రైతులు అనుసరించాల్సిన ఎరువుల యాజమాన్యం !

ప్రస్థుతం 5 సంవత్సరాల పైబడిన తోటలకు ఎకరాకు లక్ష రూపాయల కౌలు పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. నిమ్మలో రైతులు స్థానిక రకాలను ఎక్కువగా సాగుచేయటం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. రకాల ఎంపికలో సరైన అవగాహనతో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. హరికాంత్ పోరిక

నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, కాపు వుంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. పూత వచ్చిన నాలుగు నెలలకు కాయ పక్వానికి వస్తుంది. ప్రస్థుతం వచ్చే పూత నుండి అధిక దిగుబడి సాధించాలంటే నీటి యాజమాన్యం, పోషకాల విషయంలో రైతులు తగిన శ్రద్ధ పెట్టాలి. నిమ్మ తోటల్లో 4 వ సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 80 కిలోల పశువుల ఎరువు, 8 కిలోల వేప పిండి, 1600గ్రాముల యూరియా, 4000 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందించాలి. ఈ ఎరువులను రెండు సమ భాగాలుగా చేసుకుని డిసెంబరు, జనవరి మాసాల్లో ఒకసారి, జూన్ జూలై నెలల్లో రెండవ సారి వేయాలి. ( ప్రస్థుతం మొదటి దఫా) ఎరువులు అందించే సమయం. చెట్లను పూతకు వదిలే ముందు, నీటిని నిలిపి వేయాలి. 15 నుండి 30 రోజుల వరకు వాడుపెట్టిన తర్వాత తగినంత ఎరువులు వేసి నీరు పెట్టాలి.

READ ALSO : Lemon Cultivation : నిమ్మలో….కందెన మచ్చ తెగులు నివారణ

నిమ్మతోటల్లో ప్రధాన సమస్య గజ్జి తెగులు. బాక్టీరియా వల్ల సోకే ఈ తెగులు సంవత్సరం పొడవునా ఈ తెగులు తోటల్లో  కనిపిస్తూ…దిగుబడిని దెబ్బతీస్తోంది. ఈ తెగులు లక్షణాలను గమనిస్తే ఆకులు, కొమ్మలు, కాయలపై గరుకుగా వున్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల ఆకులు క్రమేపి పండుబారి రాలిపోతాయి. కాయలు నాణ్యత కోల్పోయి, పగుళ్లు సంభవిస్తాయి. కొమ్మలకు పిండి పదార్థాల సరఫరా నిలిచిపోయి ఎండిపోతాయి. దీని నివారణకు ఏటా తొలకరిలో ఎండు కొమ్మలను కత్తిరించివేయాలి.

గజ్జి తెగులు సోకిన ఆకులు, కాయలను నాశనం చేయాలి. గజ్జి తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 1 గ్రాము స్ట్రెప్టో సైక్లిన్, 30 గ్రాముల కాపర ఆక్సీ క్లోరైడ్ చొప్పున కలిపి 15రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారిచేయాలి. నీటి యాజమాన్యంలో ఒడిదుడుకులు, వాతావరణంలో హఠాత్తుగా వచ్చే మార్పులు వల్ల కూడా నిమ్మ తోటల్లో పూత, పిందె రాలిపోయే ప్రమాదం వుంది. అందువల్ల చెట్లు పూత, పిందెలతో వన్నప్పుడు తోటలో తవ్వటం, దున్నటం చేయకూడదు. ఎండలు ముదిరేకొద్దీ క్రమం తప్పకుండా నీరందించాలి. చెట్ల పాదుల్లో నీరు ఆవిరి అవ్వకుండా ఎప్పడు తేమగా వుండే విధంగా, కొబ్బరి పీచు లేదా వ్యవసాయ వ్యర్థాలతో మల్చింగ్ చేయాలి. ఈ విధమైన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులతో నిమ్మతోటల నుండి వేసవిలో మంచి దిగుబడి సాధించవచ్చు. జనవరి, ఫిబ్రవరి లో వచ్చే పూత నుండి ఏప్రెల్ లో దిగుబడి ప్రారంభమై జూన్ వరకు కొనసాగుతుంది.

READ ALSO : Lime Cultivation : నిమ్మ పూత దశలో యాజమాన్య పద్దతులు