Black Gram : మినుము పంటలో తెగుళ్ళు… యాజమాన్యపద్ధతులు

మాగాణి భూమిలో వేసిన మినుము పైర్లను 35-40 రోజుల దశలో కొరినోస్పోరా ఆకు మచ్చ్ తెగులు,45-50 రోజుల దశలో బూడిద తెగులు, 60-65రోజుల దశలో తుప్పుతెగులు ఆశిస్తాయి.

Black Gram : మినుము పంటలో తెగుళ్ళు… యాజమాన్యపద్ధతులు

Black Gram

Black Gram : తెలుగు రాష్ట్రాలలో మినుమును రబీ, వేసవి పంటగా వరికోతల అనంతరం పండిస్తారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా 15లక్షల టన్నుల మినుము పంట ఉత్పత్తి అవుతుంది. ఖరీఫ్ సీజన్ లో జూన్ 15 నుండి జులై 15 వరకు పంటసాగు అనుకూలంగా ఉంటుంది. రబీకి సంబంధించి అక్టోబరు నెల అనుకూలం. వరికోసిన మాగాని పొలాల్లో నవంబర్ నుండి డిసెంబర్ వరకు , వేసవిలో ఫిబ్రవరి నుండి మార్చి వరకు పంట వేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. మినుము పంటను అశించే వివిధ రకాల తెగుళ్ళ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మినుము పొలాల్లో కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు, ఆంత్రక్నోస్, బూడిద, తుప్పుతెగులు, ఆకు ముడత, పల్లాకు తెగుళ్ళు అధికంగా వ్యాపిస్తున్నాయి.

మినుములో బూడిద తెగులు ప్రధానమైనది. విత్తిన 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నపుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలు గా కనపడి, అవి క్రమేణా పెద్దవైఆకులపైన, కింది భాగాలకు ,కొమ్మ లకు, కాయలకు వ్యాపిస్తుంది. కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులకు సంబంధించి, ఈ తెగులు సోకియా ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అనుకూల పరిస్దితుల్లో పెద్ద మచ్చలు వలయాకారంగా ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి. తుప్పు తెగులు మినుము పంటకు నష్టం కలిగిస్తుంది. ఇది పైరు పూత దశలో ఈ తెగుల లక్షణాలు కన్పిస్తాయి. ఆకు ఉపరి తలంపైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఉంటాయి. తర్వాత కుంభా కృతి తో కూడిన గుండ్రని మచ్చలు తుప్పు రంగును పోలి ఉంటాయి.

మాగాణి భూమిలో వేసిన మినుము పైర్లను 35-40 రోజుల దశలో కొరినోస్పోరా ఆకు మచ్చ్ తెగులు,45-50 రోజుల దశలో బూడిద తెగులు, 60-65రోజుల దశలో తుప్పుతెగులు ఆశిస్తాయి. కాబట్టి పైరుపై 30-35 రోజుల దశలో ఒక లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5గ్రా.మాంకోజెబ్, 50 రోజుల దశలో లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్ + 1 మి.లీ.డైనోకాప్, 60-65రోజుల దశలో మళ్లి ఈ మందులను గానీ 1 మి.లీ. కాలిక్సిన్ కానీ పిచికారీ చేస్తే ఈ తెగుళ్ళు ను సమర్దంగా అరికట్టవచ్చు.

వేసవిలో మినుము లో ఆకు ముడత వస్తుంది. ఇది వైరస్ జాతి తెగులు. విత్తనం ద్వారా,పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. దీనినే సీతాఫలం తెగులు లేదా లీఫ్ క్రింకిల్ అని కూడా అంటారు. తెగులు సోకిన మొక్కల ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దగా పెరుగుతాయి. మొక్కలు పూత పూయక వెర్రితలలు వేస్తాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. డైమిధోయేట్ లేదా 1.5 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కలను పీకి తగలు బెట్టాలి. తెగులు సోకని మొక్కల నుంచి విత్తనం తీసుకోవాలి.