Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు

పశుల నుండి వచ్చే వ్యర్థాలను ఇటు పంటలకు ఉపయోగించడమే కాకుండా ఉపపత్పత్తులను తయారు చేస్తున్నారు రైతు. ముఖ్యంగా ఆవు పేడతో పిడకలు, దూప్ స్టిక్స్, సబ్బుల తయారీ చేస్తున్నారు. వీటితోపాటు పంట దిగుబడులను వ్యపారులకు అమ్మకుండా.. నేరుగా వినియోగదారులకు అమ్మడంతో అధిక ఆదాయం పొందుతున్నారు.

Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు

Natural Farming

Natural Farming : ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ. కలిగే లాభాలు ఎక్కువ. రసాయనాలతో నిస్సారంగా మారిన నేలకు కూడా సహజ సాగు పద్ధతుల ద్వారా పునరుజ్జీవం కల్పించవచ్చు. ప్రకాశం జిల్లాకు  చెందిన ఓ రైతు ఇదే విషయాన్ని ఆచరణలో చేసి చూపారు. ప్రకృతి విధానంలో వేరుశనగ సాగు చేస్తున్న ఆయన… జీవం కోల్పోయిన మట్టిలో గో ఆధారిత సేద్యం ద్వారా తిరిగి బంగారు పంటలు పండించగలుగుతున్నారు.

READ ALSO : Sustainable Agriculture : పామాయిల్, కొబ్బరి, డెయిరీ తో సుస్థిర వ్యవసాయం

దశబ్దకాలంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. అధిక దిగుబడి ఇచ్చే వంగడాల మాయలో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం సేద్యాన్ని పతనావస్థకు చేర్చింది. భూములు నిస్సారం అవ్వడం, చీడ పీడల ఉధృతి పెరగటం వల్ల దిగుబడును తగ్గుతూ వచ్చాయి. ఓవైపు పెరిగిన పెట్టుబడి మరో వైపు కూలీల కొరతకు తోడు సాగు భారం రైతును వెన్నాడుతుంది.

READ ALSO : Sugarcane Cultivation : చెరకు సాగులో మెళకువలు

ఈ పరిస్థితులను అనుభవం ద్వారా తెలుసుకున్న ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, పాదూర్తి గ్రామానికి చెందిన రైతు రామారావు.. గోఆధారిత ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం అనుకున్నారు. తనకు తెలిసిన మిత్రుల ద్వారా గోఆధారిత వ్యవసాయంలో శిక్షణ తీసుకొని పంటల సాగు చేపట్టారు. అంతే కాకుండా ఇంట్లో కిచెన్ గార్డెన్ కూడా పెంచుతున్నారు. అయితే మొదట్లో శ్రమ పెరగడం.. దిగుబడులు తగ్గినా.. వెనుకడుగు వేయలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా సాగుచేపట్టడంతో ఏఏటికాయేడు.. పెట్టుబడులు తగ్గుతూ.. దిగుబడులు పెరుగుతూ వచ్చాయి.

READ ALSO : Ganuga Oil : గానుగ నూనెతో లాభాల బాట..

తనకున్న పశుల నుండి వచ్చే వ్యర్థాలను ఇటు పంటలకు ఉపయోగించడమే కాకుండా ఉపపత్పత్తులను తయారు చేస్తున్నారు రైతు. ముఖ్యంగా ఆవు పేడతో పిడకలు, దూప్ స్టిక్స్, సబ్బుల తయారీ చేస్తున్నారు. వీటితోపాటు పంట దిగుబడులను వ్యపారులకు అమ్మకుండా.. నేరుగా వినియోగదారులకు అమ్మడంతో అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ రైతు సాగు విధానాలను చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం ఆచరిస్తున్నారు.