Cucumber : దోససాగు…దిగుబడినిచ్చే విత్తన రకాలు

పచ్చిదోస రకాలకు సంబంధించి జపనీస్ లాంగ్ గ్రీన్, స్ట్రెయిట్ ఎయిట్, కో1, పూసా సంయోగ మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ కాలంలో కోత కు వచ్చే పచ్చిదోస రకాలలో కో1 రకం ఒకటి.

Cucumber : దోససాగు…దిగుబడినిచ్చే విత్తన రకాలు

Cucumber

Cucumber : దోస అన్ని కాలాల్లోను మంచి డిమాండ్ ఉన్నపంట. తక్కువ పెట్టుబడితో..స్వల్పకాలంలో రైతులకు మంచి అదాయం ఇస్తుంది. వేసవి కాలంలో ఈ పంటకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు లాభాలు తెచ్చిపెడుతుంది. ఖర్చులు పెద్ద మొత్తంలో పెట్టాల్సిన బాధ ఉండదు. చీడపీడలు, తెగుళ్ళు, రసాయన మందుల వాడకం వంటివి అసలే ఉండవు. తీగజాతి సాగు కూరగాయల్లో తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటగా దోసను చెప్పవచ్చు.

అన్ని రకాల నేలల్లో దీనిని సాగుచేయవచ్చు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వి్తనాలను విత్తకోవటానికి అనుకూలంగా ఉంటుంది. వేసవి పంటగా మార్చి నెల చివరి వరకు విత్తుకోవచ్చు. దోసలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కూర దోస, రెండోది పచ్చి దోస, కూరదోస విత్తన రకాలు చాలా ఉన్నాయి. మంచి దిగుబడినిచ్చిన రకాల్లో ఆర్ ఎన్ ఎస్ ఏం 1 దోసరకం ఒకటి. దోసకాయలు చారలు కలిగి పొడవుగా ఉంటాయి. తక్కవ నీటితో మంచి దిగుబడిని పొందవచ్చు. రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. 130 రోజుల నుండి 140 రోజుల వరకు పంటకాలం. ఎకరాకు 70 క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తుంది.

ఆర్ ఎన్ ఎస్ ఏం3 రకం దోసకాయలు రైతుకు మంచి లాభసాటిగా ఉంటాయి. గుండ్రంగా ఉండి, పసుపు రంగులో ఉండే ఈ దోసలను తెలంగాణాలోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం విడుదల చేసింది. ఇవే కాకుండా మార్కెట్లో అనేక రకాల హైబ్రీడ్ దోసకాయ రకాల విత్తనాలు సైతం అందుబాటులో ఉన్నాయి. నాంధరి,910,అభిజిత్ గ్లోరీ మల్టీస్టార్ రకాలు ఛీడపీడలను తట్టుకుని రైతులకు మంచి దిగుబడులందిస్తున్నాయి.

పచ్చిదోస రకాలకు సంబంధించి జపనీస్ లాంగ్ గ్రీన్, స్ట్రెయిట్ ఎయిట్, కో1, పూసా సంయోగ మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ కాలంలో కోత కు వచ్చే పచ్చిదోస రకాలలో కో1 రకం ఒకటి. ఇది పూత పూసిన 16రోజుల్లో కోతకు వస్తుంది. ఈ రకం దోస ఎకరాకు 100 నుండి 112 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. జపనీస్ లాంగ్ గ్రీన్ రకం 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. త్వరగా కోతకు వచ్చే రకం ఇది. మధ్యస్ధంగా పొడవు పెరుగుతాయి. లేత ఆకుపచ్చరంగులో ఉండి గుండ్రంగా ఉంటాయి. పాసన్ సయోగ్ రకం దోస ఢిల్లీ వ్యవసాయ విశ్వ విద్యాయలం రూపొందించింది. ఈ రకం ఎకరానికి 65 క్వింటాళ్ళ వరకకు దిగుబడినిస్తుంది.