Gogu Flowers Cultivation : విశాఖ మన్యంలో గోగు పూల సాగు.. ఒక పంటతో మూడు ఆదాయాలు పొందుతున్న గిరిజన రైతులు

చింతపల్లి కేంద్రంగా  సుస్థిర సేంద్రియ వ్యవసాయ సంఘం స్వచ్ఛంద సంస్థ  రైతులతో పలు రకాల పంటలను సాగుచేయిస్తోంది. ఇప్పటికే విదేశీ కూరగయాలతో పాటు రాజ్ మా, అల్లం, పసుపు, నీలిమందు పంటలను సాగుచేయిస్తున్న ఈ సొసైటీ.. ఇప్పుడు గోంగూర పూల సాగుచేయిస్తోంది.

Gogu Flowers Cultivation : విశాఖ మన్యంలో గోగు పూల సాగు.. ఒక పంటతో మూడు ఆదాయాలు పొందుతున్న గిరిజన రైతులు

Gogu Flowers Cultivation Process

Gogu Flowers Cultivation : భౌగోళికంగా సముద్రమట్టానికి ఎత్తులో ఉన్న విశాఖ జిల్లా నిత్యం భిన్నమైన వాతావరణంతోనే నిండి ఉంటుంది. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవించే ఆదివాసీ గిరిజనులు ఇక్కడ అధికంగా కనిపిస్తారు. కాలం మారుతున్న కొద్దీ మన్యంలోనూ గిరిజనుల జీవన విధానాలు మారుతున్నాయి. అందుకు తగ్గట్టే సాగూ మారుతోంది. ఎన్.జి.వోల సహకారంతో మన్యంలో  సంప్రదాయ పంటలతో పాటు విదేశీ పంటలను సాగుచేస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే ఇప్పుడు గోగు పూలను ఉత్పత్తి చేసి అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు.

READ ALSO : High Profit Farming : ఎకరంలో 30 పంటల సాగు.. ఏడాదికి ఆదాయం రూ. 3 లక్షలు

విశాఖ జిల్లా, మన్యం ప్రాంతం.. ఇక్కడ ఏడాది పొడవునా వ్యవసాయం చేస్తారు గిరిజన రైతులు. కానీ పైసా సంపాదన ఉండేది కాదు. అవే వెతలు, అవే కన్నీటి కథలు. వీరి జీవితాల్లో వెలుగును నింపేందుకు, ఎన్.జి.వోలు చాలానే ప్రవేశించాయి. సంప్రదాయ పంటల సాగుతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను వీరికి పరిచయం చేశాయి. విత్తనాలు, ఎరువులు అందించి, ఆ పంటల సాగుపట్ల శిక్షణ ఇచ్చి వారితో సాగుచేయించాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్ ను  సృష్టించి, మంచి లాభాలు వచ్చేలా చేశాయి.

READ ALSO : High Yielding Rice : భాస్వర శాతం తక్కువగా ఉన్న అధిక దిగుబడినిచ్చే వరి రకాలు

ఈ కోవలోనే  చింతపల్లి కేంద్రంగా  సుస్థిర సేంద్రియ వ్యవసాయ సంఘం స్వచ్ఛంద సంస్థ  రైతులతో పలు రకాల పంటలను సాగుచేయిస్తోంది. ఇప్పటికే విదేశీ కూరగయాలతో పాటు రాజ్ మా, అల్లం, పసుపు, నీలిమందు పంటలను సాగుచేయిస్తున్న ఈ సొసైటీ.. ఇప్పుడు గోంగూర పూల సాగుచేయిస్తోంది. మార్కెట్ లో గోగు పూలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థ రైతుల చేత అధిక విస్తీర్ణంలో గోంగూర  సాగుచేయిస్తోంది.

READ ALSO : Banana Crop Cultivation : ప్రయోగాత్మకంగా అరటి సాగు.. లాభాలు అధికం అంటున్న రైతు

సాధారణంగా గోంగూర ఆకులను తెంపి కూరగా వండుకుంటాము. తరువాత కొమ్మలను పడేస్తుంటాం. అయితే ఇప్పడు పూవ్వులు పూసేదాక మొక్కలను అలాగే ఉంచుతున్నారు. ఆకులను మాత్రమే కూరగా కోసుకుంటున్నారు. పువ్వులను రాగానే కోసి ఎండబెట్టి మార్కెట్ చేస్తున్నారు. ఈ పువ్వులను టీ ఫ్లేవర్ గా, జామ్ గా తయారు వాడుతుంటారు. అంతే కాదు పువ్వులో వచ్చిన గింజలను విత్తనంగా అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు.

READ ALSO : Sapota Cultivation : సపోటా సాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ

ఉద్యాన పంటలకు సరిసమానంగా మన్యంలో గిరిజనులు విదేశీ కాయగూరల సాగునూ మొదలు పెట్టారు.  దీంతో గిరిజనుల జీవనశైలినే పూర్తిగా మారిపోయింది.  ఇప్పటికే కాఫీ, రాజ్‌మా , అల్లం, పసుపు పంటలతో మంచి ఆదాయం పొందుతున్న ఇక్కడి రైతుల పొలాల్లో ఇప్పుడు గోంగూర వచ్చి చేరింది. ఒకే పంటపై మూడు రకాల ఆదాయం వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.