Income From Floriculture : కూరగాయలతో పాటు కనకాంబరాల సాగు… పూలసాగుతో నిత్యం ఆదాయం

అయితే  ఈ ఏడాది  కూరగాయల పంటలకు తెగుళ్లు సోకడంతో కొంతమేరకు నష్ట వచ్చినప్పటికీ, పూలసాగు రైతులను ఆదుకుంది. వ్యాపారులు ఇక్కడి మార్కెట్ లో కిలో కనకాంబరాల పూలను 500 నుండి 700 రూపాయలకు కొనుగోలు చేసి  సాలూరు, బొబ్బిలి, విజయనగరం, పార్వతీపురం, గజపతినగరం, ఒడిశా ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు.

Income From Floriculture : కూరగాయలతో పాటు కనకాంబరాల సాగు… పూలసాగుతో నిత్యం ఆదాయం

income from floriculture

Income From Floriculture : కూరగాయలతో పాటు కనకాంబర పూలసాగును చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు విజయనగరం జిల్లా, రామభద్రపురం గ్రామ రైతులు. ఏ పొలంలో చూసిన నవ్వుతూ పలకరించే కనకాంబరాలే కనిపిస్తాయి. అటుగా వెళ్తున్న వారిని చిరునవ్వుతో స్వాగతిస్తున్నట్లు పరుచుకుంటాయి. సింధూర వర్ణంలో చూపరులను ఆకర్షించే ఈ కనకాంబరాలు ఆ ఊరి రైతులకు ఆదాయవనరుగా మారాయి. కూరగాయల సాగులో నష్టాలు వచ్చినా, పూలే.. వారి పొట్ట నింపుతున్నాయి.

READ ALSO : Chamanthi Cultivation : లాభాలు పూయిస్తున్న చామంతి పూల సాగు

విజయనగరం జిల్లా, రామభద్రపురం పేరువినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది కూరగాయలు, పూల మార్కెట్టు. ఈ ప్రాంతంలోని రైతులు పలు రకాల కూరగాయలతో పాటు, వివిధ రకాల పూలసాగుకు కూడా సాగుచేయడం ప్రత్యేకత. ముఖ్యంగా కనకాంబర పూలను ఒక్కొక్కరూ 10 నుంచి 20 సెంట్ల భూమిలో సాగు చేస్తూ ఉంటారు.

అయితే  ఈ ఏడాది  కూరగాయల పంటలకు తెగుళ్లు సోకడంతో కొంతమేరకు నష్ట వచ్చినప్పటికీ, పూలసాగు రైతులను ఆదుకుంది. వ్యాపారులు ఇక్కడి మార్కెట్ లో కిలో కనకాంబరాల పూలను 500 నుండి 700 రూపాయలకు కొనుగోలు చేసి  సాలూరు, బొబ్బిలి, విజయనగరం, పార్వతీపురం, గజపతినగరం, ఒడిశా ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు.

READ ALSO : Gerbera Farming: ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకూ ఆదాయం.. జెర్బరా ప్రత్యేకత అదే

కనకాంబరాలు సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఉష్ణోగ్రతలు, వర్షపాతం అధికంగా ఉంటే.. నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పూల సాగు చేయాలంటే ఎప్పటికప్పుడు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలని చెబుతున్నారు ఉద్యాన అధికారులు.

కనకాంబరాలను సాగు చేయాలకునే రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నాటిన రెండు నెలకు పూలు చేతికి వస్తాయి. 10 నుంచి 40 సెంట్ల భూమిలో సాగు చేస్తే.. పెట్టుబడి రూ 5000 నుంచి 7000 వరకు అవుతుంది. దాదాపు 70 నుంచి 80 కిలోల వరకు దిగుబడి పొందవచ్చు. మార్కెట్‌లో కనకరాంబరాలు అధిక డిమాండ్‌పలకడంతో.. పెట్టుబడి పోనూ..రూ. 35 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.